Webdunia - Bharat's app for daily news and videos

Install App

విక్రమ్ ల్యాండర్‌ను గుర్తించాం : ఇస్రో

Webdunia
మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (12:29 IST)
చంద్రుడి దక్షిణ ధృవం పరిశోధన నిమిత్తం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చంద్రయాన్-2 మిషన్ ద్వారా నింగిలోకి పంపిన విక్రమ్ ల్యాండర్‌ను గుర్తించినట్టు ఇస్రో మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది. చంద్ర‌యాన్-‌2కు చెందిన ఆర్బిటార్‌.. విక్ర‌మ్ ప‌డిన ప్రాంతాన్ని గుర్తించిన‌ట్లు ఇస్రో పేర్కొన్న‌ది.
 
అయితే, విక్ర‌మ్ ల్యాండ‌ర్‌తో ఎటువంటి క‌మ్యూనికేష‌న్ జ‌ర‌గ‌లేద‌ని ఇస్రో వెల్లడించింది. ల్యాండ‌ర్‌తో క‌మ్యూనికేష‌న్ ఏర్ప‌రిచేందుకు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలిపింది. సెప్టెంబ‌రు 7వ తేదీ అర్థరాత్రి 1.51 నిమిషాల స‌మ‌యంలో చంద్రుడి ఉప‌రిత‌లంపై విక్రమ్ ల్యాండర్ దిగుతూ కుదేలుకు (హార్డ్ ల్యాండింగ్) గురైంది. ఆ సమయంలో ల్యాండ‌ర్ వెలాసిటీ అదుపుత‌ప్ప‌డంతో అది స్టాఫ్ ల్యాండింగ్ స్థానంలో హార్డ్ ల్యాండింగ్ అయింది. దీంతో ల్యాండ‌ర్ నుంచి సిగ్న‌ల్స్ బ్రేక‌య్యాయి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఛవా చిత్రంలో మహారాణి యేసుబాయి గా రశ్మిక మందన్నా

ఇండో-కొరియన్ హర్రర్ కామెడీ చిత్రంలో వరుణ్ తేజ్

క్లైమాక్స్ సన్నివేశాల్లో నితిన్ చిత్రం తమ్ముడు

తెలుగులోనే ఎక్కువ అభిమానులున్నారు, అందుకే మ్యూజికల్ కాన్సర్ట్ : సిధ్ శ్రీరామ్

Kiran Abbavaram: తండ్రి కాబోతున్న కిరణ్ అబ్బవరం.. కతో సక్సెస్‌.. దిల్‌రుబాతో రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Golden Milk: గోల్డెన్ మిల్క్ హెల్త్ బెనిఫిట్స్

అంజీర్ పండ్లు అద్భుత ప్రయోజనాలు

కర్నూలుకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన ఫెర్టిలిటీ కేర్‌ను తీసుకువచ్చిన ఫెర్టీ9

భారతదేశంలో డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్ సెంటర్‌: లీసెస్టర్ విశ్వవిద్యాలయంతో అపోలో భాగస్వామ్యం

తిన్నది గొంతులోకి వచ్చినట్లుంటుందా?

తర్వాతి కథనం
Show comments