జూనియర్ ఎన్టీఆర్ పైన లక్ష్మీపార్వతి కామెంట్స్, సీఎం జగన్ ఎలా స్పందిస్తారో?

Webdunia
సోమవారం, 18 నవంబరు 2019 (17:26 IST)
తాతయ్య ఎన్టీఆర్ ముఖకవళికలతో నటనలో ఆకట్టుకుంటూ, ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోని అగ్ర తారల్లో వున్న జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మంచి సమయస్ఫూర్తితో మాట్లాడే జూ.ఎన్టీఆర్ అంటే ఇండస్ట్రీలో చాలామంది హీరోలు, హీరోయిన్లు లైక్ చేస్తారు. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగుతో బిజీగా వున్నారు. 
 
ఐతే ఇప్పుడు హఠాత్తుగా వైసీపీ నాయకుల నోళ్లలో జూ.ఎన్టీఆర్ పేరు నానుతోంది. అదికూడా తెదేపా పని అయిపోయిందనీ, చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ ఇద్దరూ పార్టీ పగ్గాలను వదిలేసి కుప్పం వెళ్లడం మంచిదంటూ కామెంట్లు చేస్తున్నారు. అలా వెళ్లేముందు పార్టీ పగ్గాలను జూ.ఎన్టీఆర్‌కి ఇచ్చి వెళ్లాలనీ, తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురాగల సత్తా ఒక్క జూనియర్ ఎన్టీఆర్‌కే వున్నదంటూ చెపుతున్నారు.
 
తాజాగా ఇదే విషయమై ఎన్టీఆర్ సతీమణి, తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీపార్వతి మాట్లాడుతూ... నిజమే, నారా లోకేష్ కంటే జూ.ఎన్టీఆర్ 100 రెట్లు బెటర్. ఏ విషయంలోనైనా అతడె కరెక్ట్. ఎన్టీఆర్‌కి సబ్జెక్ట్ పైన మంచి పట్టు వుందనీ, వాక్చాతుర్యం కూడా వుందని, నారా లోకేష్ కంటే జూ.ఎన్టీఆర్ ప్రతి ఒక్క విషయంలోనూ బెటరేనంటూ కితాబిచ్చారు.
 
అంతకుముందు వల్లభనేని వంశీ కూడా దాదాపు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. జూ.ఎన్టీఆర్ పార్టీ పగ్గాలు చేపడతారేమోనని నారా లోకేష్ భయపడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. మరి ఈ కామెంట్లన్నిటినీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎలా చూస్తారో? వేచి చూడాల్సిందే?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments