Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశ్వాస పరీక్షను ప్రవేశపెట్టిన యడ్యూరప్ప.. రాజీనామా లేఖ సిద్ధం?

కర్ణాటక రాజకీయాలు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. శనివారం సాయంత్రం 4 గంటలకు సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఆ రాష్ట్ర శాసనసభలో విశ్వాస పరీక్షను ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆయన తన ప్రసంగాన్ని

Webdunia
శనివారం, 19 మే 2018 (15:56 IST)
కర్ణాటక రాజకీయాలు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. శనివారం సాయంత్రం 4 గంటలకు సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఆ రాష్ట్ర శాసనసభలో విశ్వాస పరీక్షను ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అయితే, ఆయన విశ్వాస పరీక్షలో ఓడిపోతామన్న నిర్ణయానికి వచ్చి రాజీనామా లేఖను సిద్ధం చేసుకుని తన ప్యాకెట్‌లో పెట్టుకుని తన ప్రసంగాన్ని ప్రారంభించినట్టు తెలుస్తోంది.
 
అంతకుముందు శనివారం ఉదయం 11 గంటలకు ఆ రాష్ట్ర శాసనసభ ప్రారంభమైంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత భోజన విరామ సమయం ప్రకటించారు. పిమ్మట మధ్యాహ్నం 3.30 గంటలకు కొలువుదీరిన తీరిన తర్వాత మరికొంతమంది ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు. 
 
ఈ ప్రమాణ స్వీకారాల తంతు ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి యడ్యూరప్ప విశ్వాస పరీక్ష తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. విశ్వాస పరీక్షలో యడ్యూరప్ప ప్రసంగం తర్వాత యడ్యూరప్ప గవర్నర్ వజూభాయ్ వాలాతో సమావేశమై తన రాజీనామా లేఖను సమర్పిస్తారన్న ఊహాగానాలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments