మోడీ కల్లిబొల్లి మాటలు కడుపు నింపవు : సోనియా గాంధీ

ప్రధాని నరేంద్ర మోడీ ఊకదంపుడు ప్రచారంతో ప్రజల కడపు నిండదని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. ఈనెల 12వ తేదీన జరుగనున్న కర్ణాటక ఎన్నికల పోలింగ్‌ కోసం ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో

Webdunia
బుధవారం, 9 మే 2018 (10:35 IST)
ప్రధాని నరేంద్ర మోడీ ఊకదంపుడు ప్రచారంతో ప్రజల కడపు నిండదని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. ఈనెల 12వ తేదీన జరుగనున్న కర్ణాటక ఎన్నికల పోలింగ్‌ కోసం ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగియనుంది. దీంతో సోనియా గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
 
ఈ ప్రచారంలో భాగంగా, విజయపురలో జరిగిన బహిరంగ సభలో ఆమె పాల్గొని ప్రసంగిస్తూ, రాష్ట్రంలో కరువు పరిస్థితిపై మోడీని సీఎం సిద్ధరామయ్య కలవాలనుకుంటే అపాయింట్‌మెంట్ ఇవ్వలేదన్నారు. కర్ణాటకను దేశంలో నెంబర్‌వన్‌గా అభివృద్ధి చేసింది కాంగ్రెస్సేనని ఆమె గుర్తుచేశారు. మోడీ గొప్ప వక్త అన్న సోనియా… ఆయన మాటలు దేశంలో ఎవరి కడుపు నింపబోవన్నారు. 
 
అంతకుముందు మోడీ కూడా విజయపుర జిల్లాలోనే ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. కొప్పాల్‌లోనూ ప్రచారం చేశారు. కన్నడ రైతుల ఘోష కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టడంలేదని మోడీ ఆరోపించారు. పంటకు అయ్యే ఖర్చుపై ఒకటిన్నర రెట్లు మద్దతు ధర ఇచ్చేలా… కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

PM Modi: ప్రధాని మోదీ పెద్ది గురించి అడిగారు, వెస్ట్ బెంగాల్‌లో యూత్ పెద్ది గెటప్‌తో వచ్చారు: రామ్ చరణ్

Radhya: ది రెడ్ బ్యాగ్ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య లుక్

Satyadev: బిహైండ్ ది వుడ్స్ ఆఫ్ సమవర్తి మేకింగ్ లో సత్యదేవ్

Vadenaveen: వడ్డే నవీన్‌ ట్రాన్స్‌ఫ‌ర్ త్రిమూర్తులు నుంచి తొలి సాంగ్ ‘టా టా’ను విడుదల

హర్షిత్ రెడ్డి దీవాన మూవీ నుంచి వన్ సైడ్ లవ్ స్టోరీ పాటకు ఆదరణ

తర్వాతి కథనం
Show comments