Webdunia - Bharat's app for daily news and videos

Install App

జె.సి. దివాకర్ రెడ్డికి సరైనోడు దొరికాడు.. ఎవరు..?

Webdunia
శనివారం, 29 డిశెంబరు 2018 (17:12 IST)
పోలీసులందరూ చేతులకు గాజులు తగిలించుకుని కూర్చున్నారు అంటూ ఎంపి జె.సి.దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో కదిరికి చెందిన సిఐ మాధవ్ ఎంపి వ్యాఖ్యలను తప్పుబడుతూ మీసం మెలేసి పోలీసులు మగాళ్ళు అన్నారు. దీంతో ఇది కాస్తా పొలిటికల్, పోలీసుల మధ్య వార్‌కు దారితీసింది. అప్పట్లో ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లోను తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
 
ఆ సిఐ మీసం మెలేసిన వీడియోలు టీవీల్లోను, సోషియల్ మీడియాలోను వైరల్ అయ్యాయి. ఆ తరువాత ఇద్దరి మధ్య వ్యవహారం ఆగిపోయింది. కానీ తాజాగా సిఐ మాధవ్ తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వెళ్ళాలన్న నిర్ణయానికి వచ్చేశారట. ఇప్పటికే తన రాజీనామా లేఖను ఎస్పీని కలిసి అందించారు మాధవ్. 
 
త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి వైసిపి తరపున పోటీ చేయాలన్న నిర్ణయానికి వచ్చారట. ప్రజలకు సేవ చేసేందుకే మాధవ్ రాజకీయాలను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. పోలీసు వృత్తిలో కూడా మచ్చలేని వ్యక్తిగా మాధవ్ పనిచేశాడట. దీంతో ఆయన వైసిపి తరపున హిందూపురం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఐతే వచ్చే ఎన్నికల్లో జె.సి. దివాకర్ రెడ్డి పైనే మాధవ్ పోటీ చేయనున్నారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments