చంద్రుడిపై కాంతి.. పని ప్రారంభించిన చంద్రయాన్-2 ఆర్బిటర్ (video)

Webdunia
శుక్రవారం, 18 అక్టోబరు 2019 (10:47 IST)
చంద్రుడి దక్షిణ ధృవం అన్వేషణ నిమిత్తం భారత అంతరిపక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చంద్రమండలంపైకి పంపించిన చంద్రయాన్-2 ఆర్బిటర్ మళ్లీ తన పనిని మొదలుపెట్టింది. చంద్రుడి ఉత్తరార్ధ గోళంపై రెండు వారాలపాటు చీకటి రాజ్యమేలడంతో ఫొటోలు పంపలేకపోయిన ఆర్బిటర్.. ఇప్పుడిప్పుడే కాంతి ప్రసరిస్తుండడంతో ఆ ఫొటోలను పంపింది. ఈ విషయాన్ని ఇస్రో వెల్లడించింది. 
 
జాబిల్లి ఉపరితలంపై చంద్రయాన్-2 ఆర్బిటర్ తిరిగి పరిశోధనలు ప్రారంభించిందని పేర్కొంది. ఆర్బిటర్‌లోని ఇమేజింగ్ ఇన్‌ఫ్రారెడ్ స్పెక్ట్రోమీటర్ (ఐఐఆర్ఎస్) చంద్రుడిపై కాంతి ప్రసరించిన కొంత భాగాన్ని చిత్రీకరించి పంపిందంటూ ఓ  ఫొటోను విడుదల చేసింది. ఇందులో బిలాలు, సోమర్‌ఫీల్డ్, స్టెబిన్స్, కిర్క్‌ఉడ్‌లు స్పష్టంగా కనబడుతున్నాయి. 
 
విక్రమ్‌కు ఏం జరిగిందో వెల్లడిస్తాం : ఇస్రో 
 
చంద్రుడి దక్షిణ ధృవం పరిశోధన నిమిత్తం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చేపట్టిన చంద్రయాన్‌ 2 ప్రాజెక్టుకి చెందిన విక్రమ్ ల్యాండర్‌ వ్యవహారాన్ని నిగ్గు తేల్చేందుకు ఇస్రో చర్యలు చేపట్టింది. ఇందుకోసం అమెరికా పరిశోధనా సంస్థ నాసాతో కలిసి ప్రయత్నాలు మొదలుపెట్టనుంది. 
 
ఆ సంస్థకు చెందిన లూనార్ రిక‌న‌యిసెన్స్ ఆర్బిటార్ (ఎల్ఆర్వో) చంద్రుడి ద‌క్షిణ ధ్రువానికి సంబంధించిన పలు చిత్రాల‌ను తీసింది. ప్రస్తుతం వీటిని ప‌రిశీలిస్తున్నామ‌ని, విక్రమ్‌ ల్యాండర్‌కు ఏం జరిగిందన్న వివరాలను త్వరలో వెల్లడిస్తామని ఎల్ఆర్వో ప్రాజెక్టు శాస్త్ర‌వేత్త నోహా పెట్రో వెల్లడించారు. 
 
గత మూడు రోజుల క్రితం చంద్రుడి ఉప‌రిత‌లంపై వెలుతురు పెరిగింద‌ని, అయితే, గత నెల‌తో పోలిస్తే ద‌క్షిణ ధ్రువ ప్రాంతంలో నీడ త‌గ్గింద‌ని ఆయన వివరించారు. గత నెల 17వ తేదీన కూడా ద‌క్షిణ ధ్రువం నుంచి ఎల్ఆర్‌వో వెళ్లిన విషయం తెలిసిందే. 
 
అయితే, అక్క‌డ వెలుతురులేని కార‌ణంగా విక్ర‌మ్ ఆచూకీ తెలియరాలేదు. కాగా, విక్రమ్‌ ల్యాండర్‌ను గత నెల 7వ తేదీ తెల్లవారుజామున ఇస్రో దక్షిణ ధ్రువంపై దించే కార్యక్రమాన్ని నిర్వహించింది. విజయపుటంచుల వరకు చేరుకొని చంద్రుడిపైకి అడుగుపెడుతుందన్న సమయంలో విక్రమ్ ల్యాండర్ హార్డ్ ల్యాండింగ్ కారణంగా కమ్యూనికేషన్‌తో సంబంధాలు తెగిపోవడంతో ఈ ప్రాజెక్టు విజయవంతకాలేకపోయింది.  
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరేళ్ల రిలేషన్‌షిప్ తర్వాత రెండో పెళ్ళికి సిద్ధమైన బాలీవుడ్ నటుడు...

Dhandoraa Title Song: దండోరా మూవీ టైటిల్ సాంగ్‌ విడుదల.. నిను మోసినా న‌ను మోసినా..

వెంకీ మామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మన శంకర వర ప్రసాద్ గారు

DVS Raju: డీవీఎస్ రాజు 97వ జయంతి వేడుకలు.. ఎన్టీఆర్‌తో ఎన్నో?

వృష‌భ‌ నుంచి తండ్రీ కొడుకుల అనుబంధాన్ని తెలియజేసే అప్పా సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అప్పుడప్పుడు కాస్త పచ్చికొబ్బరి కూడా తింటుండాలి, ఎందుకంటే?

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

తర్వాతి కథనం