Webdunia - Bharat's app for daily news and videos

Install App

30 ఇయర్స్ ఇండస్ట్రీకి సిఎం మళ్ళీ ఆ అవకాశం ఇస్తున్నారట..? (video)

Webdunia
శనివారం, 18 జులై 2020 (15:15 IST)
30 ఇయర్స్ ఇండస్ట్రీ.. ఈ డైలాగ్ వెంటనే గుర్తుకు వస్తారు ఫృథ్వీ. ఈయన గురించి అస్సలు చెప్పనవసరం లేదు. వైసిపి అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డికి బాగా క్లోజ్‌గా మెలిగారు. ఆ సన్నిహితంతోనే ఏకంగా ఎస్వీబీసీ ఛైర్మన్ పదవిని అప్పగించారు. వేంకటేశ్వర భక్తి ఛానల్లో కీలక పదవి. 
 
అలాంటి పదవిలో చాలా తక్కువ రోజులు కొనసాగిన పృథ్వీ ఆ తరువాత వేధింపుల విమర్శలతో పదవికే రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. చివరకు ఫృథ్వీకి ఇంకెలాంటి పదవులు ఉండవని అందరూ అనుకున్నారు. టిటిడి లాంటి సంస్థలో పనిచేసి చెడ్డపేరు తెచ్చుకున్న ఫృథ్వీ ఇక వైసిపి అధికారంలో ఉన్నంత వరకు ఎలాంటి పదవులు ఇవ్వరని అందరూ అనుకున్నారు.
 
కానీ ఫృథ్వీ మాత్రం ఏకంగా ఎంపి సీటుపైనే దృష్టి పెట్టారు. నర్సాపురం ఎంపి రఘురామక్రిష్ణమరాజు వ్యవహారం వైసిపిలో పెద్ద గందరగోళం నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ సీటు ఖాళీ అవుతుందనీ, ఆ సీటుకు తన పేరు ఖరారు చేయాలని తనకున్న పరిచయాలతో ట్రై చేసుకుంటున్నాడట ఫృథ్వీ. 
 
నర్సాపురంలో నన్ను నిలబెడితే భారీ మెజారిటీతో గెలుపొందుతానని ధీమాతో చెబుతున్నాడట. అయితే వైసిపి అధినాయకులు మాత్రం దీనిపై అస్సలు పట్టించుకోవడం లేదట. కానీ ఫృథ్వీ మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా తన ప్రయత్నం మాత్రం ఆపడం లేదట. ఏం జరుగుతుందో మరి. 

 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments