Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్ను శిలువపై ఉరి తీయాలన్నది ఎన్డీయే ప్లాన్ : విజయ్ మాల్యా

దేశంలోని పలు బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకుని వాటిని చెల్లించకుండా విదేశాలకు పారిపోయిన లిక్కర్ డాన్ విజయ్ మాల్యా. ఈయనగారు ఇపుడు దెయ్యాలు వేదాలు వల్లించిన చందంగా మాట్లాడుతున్నారు. బ్యా

Webdunia
మంగళవారం, 10 జులై 2018 (10:43 IST)
దేశంలోని పలు బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకుని వాటిని చెల్లించకుండా విదేశాలకు పారిపోయిన లిక్కర్ డాన్ విజయ్ మాల్యా. ఈయనగారు ఇపుడు దెయ్యాలు వేదాలు వల్లించిన చందంగా మాట్లాడుతున్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించడం మానేసి... కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే సర్కారుపై రాజకీయ విమర్శలు గుప్పిస్తున్నారు.
 
విజయ్ మాల్యాను ఆర్థిక నేరగాడిగా ప్రకటించిన భారత ప్రభుత్వం... ఆయనను తమకు అప్పగించాలంటూ బ్రిటన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న సంగతి తెలిసిందే. పైగా, బ్రిటన్‌లో ఉన్న మాల్యా ఆస్తులను జప్తు చేయాలని కూడా డిమాండ్ చేస్తోంది. 
 
ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్న ఆయన మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో ఓట్ల కోసం తనను వాడుకోవాలని ఎన్డీయే చూస్తోందని... తనను భారత్‌కు రప్పించి, శిలువపై ఉరి తీస్తే ఓట్లు రాలతాయని భావిస్తోందంటూ వ్యాఖ్యానించారు. రాజకీయ అవసరాల కోసం భారత ప్రభుత్వం తనను వెంటాడుతోందన్నారు. 
 
ఎప్పుడో తన తండ్రి తనకు రాసిచ్చిన ఆస్తులను కూడా తీసేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రమ తీసుకుని తమరు తన వద్దకు రావడమెందుకని... తానే వచ్చి ఆస్తులను అందజేస్తానని బ్రిటీష్ ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులకు తాను చెప్పానని తెలిపారు. 
 
బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయిల నిమిత్తం... రూ.13,900 కోట్ల విలువైన తన ఆస్తులను కుదువపెట్టానని... బ్యాంకులతో ఉన్న లావాదేవీలన్నింటినీ పూర్తి చేస్తానని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments