Webdunia - Bharat's app for daily news and videos

Install App

మే నెలలో 75 వేలకు చేరుకోనున్న కరోనా కేసులు??

Webdunia
గురువారం, 23 ఏప్రియల్ 2020 (20:35 IST)
దేశంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలుచేస్తోంది. అయినప్పటికీ కేసుల తగ్గుదల కనిపించకపోగా నానాటికీ పెరిగిపోతోంది. ఫలితంగా ఇప్పటికే 21 వేల మార్కుకు తాకాయి. ఈ పరిస్థితుల్లో వచ్చే మే నెల రెండో వారానికి ఈ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 75 వేలకు చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 
 
నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ వైరస్ వ్యాప్తి మే నెలలో ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా, ఇటలీ, అమెరికా దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని కేంద్ర ఆరోగ్య శాఖ, నిపుణులు అంచనా వేసి ఈ సంక్షోభాన్ని నివారించేందుకు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 
 
ఇటలీ, అమెరికా దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని ఏ విధంగా అడ్డుకున్నారో నిశితంగా విశ్లేషించి ఇదే విధానాన్ని కూడా భారత్‌లో అమలు చేయొచ్చని ఆ నివేదిక పేర్కొంది. పైగా, లాక్‌డౌన్ ఎత్తివేసే అంశంలో కూడా అన్ని పరిస్థితులను విశ్లేషించి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. 
 
అంతేకాకుండా, ప్రస్తుతం మే మూడో తేదీ వరకు కొనసాగనున్న లాక్‌డౌన్‌ను మే నెలాఖరు వరకు పొడగించాలనే వాదనలు మీడియాలో వినిపిస్తున్నాయి. అలా చేస్తేనే జూన్ నెల మధ్యంతరానికి కరోనా కేసుల సంఖ్య సున్నాకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు డేట్ ఫిక్స్ చేశారు

గగన మార్గన్‌ లో ప్రతినాయకుడిగా విజయ్ ఆంటోని మేనల్లుడు అజయ్ ధిషన్‌

ఆయన వల్లే బాలక్రిష్ణ సినిమాలో శ్రద్దా శ్రీనాథ్ కు ఛాన్స్ వచ్చిందా?

నా అంచనా నిజమైంది, సినిమాటికా ఎక్స్‌పో మూడో ఎడిషన్ పై పి.జి. విందా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

తర్వాతి కథనం
Show comments