భారత్ - చైనాల మధ్య యుద్ధ ఘర్షణ - డ్రాగన్ సైనికుల మృత్యువాత?

Webdunia
మంగళవారం, 16 జూన్ 2020 (17:19 IST)
భారత్ చైనాల మధ్య యుద్ధ ఘర్షణ నెలకొంది. ఇరు దేశాలకు చెందిన సైనికులు గత రాత్రి లడఖ్ సరిహద్దుల్లో తలపడ్డారు. ఒకరిపై ఒకరు రాళ్ళతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ముగ్గురు భారత సైనికులు ప్రాణాలు కోల్పోయినట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఈ ఘటనపై రెండు వైపులా ప్రాణనష్టం జరిగిందని భారత ఆర్మీ చెబుతోంది. ముగ్గురు చైనా సైనికులు మరణించారని పేర్కొంది. 
 
అయితే, చైనా మీడియా సంస్థ 'గ్లోబల్ టైమ్స్' భిన్నవాదనలు వినిపిస్తోంది. లడఖ్ వద్ద గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలో ఐదుగురు చైనా సైనికులు మరణించారని, 11 మందికి గాయాలయ్యాయని ఓ కథనంలో పేర్కొంది. 'గ్లోబల్ టైమ్స్' సోషల్ మీడియాలోనూ ఇదే విషయాన్ని ప్రచారం చేస్తోంది. అయితే ఈ విషయం అధికారికంగా ఎక్కడా వెల్లడి కాలేదని కూడా ఆ మీడియా సంస్థ తెలిపింది.
 
వాస్తవానికి లడఖ్ వద్ద కొన్ని వారాలుగా భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొనివున్న విషయం తెల్సిందే. ఇరుదేశాల ఉన్నతస్థాయి సైనికాధికారులు చర్చలు జరిపినా లడఖ్ వద్ద పరిస్థితులు చక్కబడలేదు సరికదా, గతరాత్రి జరిగిన దాడి ఘటనతో మరింత వేడెక్కాయి. గాల్వన్ లోయ వద్ద జరిగిన దాడి ఘటనపై భారత ఆర్మీ స్పందించింది.
 
గత రాత్రి ఇరుదేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగిందని, భారత్, చైనా సైనికులు పరస్పరం రాళ్లతో కొట్టుకున్నారని వెల్లడించింది. ఈ దాడిలో ఓ సైనికాధికారి, మరో ఇద్దరు జవాన్లను భారత్ కోల్పోయిందని, అటు చైనా సైనికులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని వివరించింది. మన సైనికులు సంయమనం పాటించినా తొలుత చైనా సైనికులే రెచ్చగొట్టారని భారత ఆర్మీ ఆరోపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishnu Vishal: విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆర్యన్ టీజర్

శ్రీ బండే మహాకాళి ఆశీస్సులతో శ్రీమురళి చిత్రం పరాక్ ప్రారంభమైంది

Dhanush: ధనుష్‌ ఇడ్లీ కొట్టుకి యూ సెన్సార్ సర్టిఫికేట్

Tiruveer : ప్రీ వెడ్డింగ్ షో లో తిరువీర్, టీనా శ్రావ్య లపై రొమాంటిక్ సాంగ్

Akshaye Khanna: ప్రశాంత్ వర్మ.. మహాకాళి నుంచి శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

భారతదేశంలో వైభవోపేతంగా అడుగుపెట్టిన హెచ్ అండ్ ఎం బ్యూటీ కాన్సెప్ట్

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

భారతదేశంలో లాంచ్ అయిన ఫర్ ఎవర్ మార్క్ డైమండ్ జ్యుయలరి

తర్వాతి కథనం
Show comments