Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ జన్మభూమి అయోధ్యలో భూమి పూజ.. శరవేగంగా పనులు

Webdunia
మంగళవారం, 16 జూన్ 2020 (17:16 IST)
రామ జన్మభూమి అయోధ్య రామ మందిర నిర్మాణ ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఇప్పటికే 70 ఎకరాల్లో భూమిని చదును చేశారు. లాక్ డౌన్ నిబంధనల్లో భారీగా సడలింపులు ఇవ్వడంతో.. అయోధ్య రామ మందిర భూమి పూజకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. జూలై 1న అయోధ్య రామ మందిరానికి భూమి పూజను నిర్వహించేందుకు.. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తోంది.
 
భూమి పూజకు రావాలంటూ ట్రస్టు సభ్యులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఫిబ్రవరి నెలలోనే ప్రత్యేకంగా ఆహ్వానం అందించారు. ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేయబోతున్నారు. ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 
 
ఇదిలా ఉండగా.. ఢిల్లీలోనే ఉండి ప్రత్యేక పూజలు నిర్వహించి.. ఓ పునాది రాయిని మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ న్రిపేంద్ర మిష్రా ద్వారా అయోధ్యకు పంపిస్తారు. అయోధ్యలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి ఆయన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments