Webdunia - Bharat's app for daily news and videos

Install App

గెలుపు దిశగా ఈటెల రాజేందర్, 18 రౌండ్లకి భాజపా ఆధిక్యం 16,494

Webdunia
మంగళవారం, 2 నవంబరు 2021 (17:44 IST)
హుజురాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించే దిశలో వెళుతున్నారు తెలంగాణ మాజీమంత్రి ఈటెల రాజేందర్. హుజురాబాద్ ఉప ఎన్నికలో తొలుత భాజపా-తెరాస మధ్య హోరాహోరీ కనిపించింది కానీ మధ్యాహ్నం తర్వాత ఈటెల రాజేందర్ ఆధిక్యం రౌండు రౌండుకీ పెరుగుతూ వెళుతోంది. ఇక మరో నాలుగు రౌండ్లు మాత్రమే మిగిలి వున్నాయి.

 
మొత్తం 18 రౌండ్లలో కేవలం 8, 11వ రౌండ్లలో మాత్రమే తెరాస అభ్యర్థి ఆధిక్యం కనబరిచాడు. మిగిలిన రౌండ్లన్నింటిలోనూ ఈటెల రాజేందర్ ఆధిక్యం కనబరిచారు. మరోవైపు ఈటెల ఆధిక్యంలో దూసుకుపోతూ వుండటంతో భాజపా కార్యాలయం వద్ద సంబరాలు చేసుకుంటున్నారు.

 
ఇకపోతే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అధఃపాతాళానికి పడిపోయినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితిలో వుండగా తెలంగాణలోనూ అదే స్థితి కనబడుతోంది. హుజురాబాద్ ఎన్నికలో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 15 రౌండ్లు ముగిసే సమయానికి కేవలం 2వేల ఓట్లు మాత్రమే వచ్చాయంటే... ఇక ఆ పార్టీ పరిస్థితి ఏమిటో అర్థమవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Court: కోర్ట్ సినిమా నటి శ్రీదేవి కారు కొనేసిందోచ్!

Aamir Khan: రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ చిత్రం కూలీ నుంచి అమీర్‌ఖాన్‌ లుక్

నాగభూషణం మనవడు అబిద్ భూషణ్, రోహిత్ సహాని జంటగా మిస్టీరియస్

Tammudu Review: తమ్ముడు మరో గేమ్ ఛేంజర్ అవుతుందా? తమ్ముడు రివ్యూ

హరిహర వీరమల్లు దెబ్బకు యూట్యూబ్ షేక్... (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments