Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైపూర్‌లో పెట్రోల్ కొరత - బంకుల ముందు భారీ క్యూలు

Webdunia
బుధవారం, 15 జూన్ 2022 (17:46 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో పెట్రోల్ కొరత ఏర్పడింది. ఇక్కడి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బంకుల్లో పెట్రోల్ కొరతి ఏర్పడింది. దీంతో ఐఓసీ బంకుల్లో పెట్రోల్ కోసం వాహనదారులు బారులు తీరారు. వాహనాల్లో ఇంధనం నింపుకునేందుకు కిలోమీటర్​ మేర క్యూ కట్టారు. వాహనదారులు ఇంత భారీ సంఖ్యలో గుమికూడటం వల్ల పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. 
 
హెచ్​పీసీఎల్, బీపీసీఎల్​ పెట్రోల్ బంకుల్లో మంగళవారం మధ్యాహ్నమే స్టాక్ అయిపోవడం వల్ల జైపుర్​లో పెట్రోల్, డీజిల్​కు తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో సాయంత్రం నుంచి నగరంలోని ఐఓసీఎల్ బంకుల వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. 
 
ప్రస్తుతం ఐఓసీఎల్ బంకుల్లో మాత్రమే పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉంది. రద్దీ దృష్ట్యా బంకు నిర్వాహకులు ఒక్కో వాహనంలో రూ.100 వరకు మాత్రమే పెట్రోల్, డీజిల్​ నింపుతున్నారు. గత్యంతరం లేక ప్రజలు పెద్ద పెద్ద క్యూలలో నిలబడి ఎంతో కొంత ఇంధనాన్ని ట్యాంకుల్లో నింపుకుంటున్నారు.
 
ఈ రాష్ట్రంలో మొత్తం ఏడు వేలకు పైగా పెట్రోల్ బంకులు ఉన్నాయి. వాటిలో రెండు, మూడు వేల బంకులు బీపీసీఎల్​, హెచ్​పీసీఎల్​కు చెందినవే కావడం గమనార్హం. అయితే కొద్ది కాలంగా వీటికి ఇంధన సరఫరా నిలిచిపోయింది. దీంతో రాష్ట్రంలో మూడు రోజులుగా పెట్రోల్​, డీజిల్​ కొరత ఏర్పడింది. రాజస్థాన్​లో రోజుకు సగటున 25 లక్షల లీటర్ల పెట్రోల్​, కోటి లీటర్ల డీజిల్​ను వినియోగిస్తున్నారు. వీటిలో 50 శాతం ఐఓసీఎల్​ బంకుల నుంచే విక్రయం అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ పుష్ప ఎవరి దగ్గర తగ్గడు... కానీ తొలిసారి తగ్గుతున్నాడు.. పుష్ప-2 ట్రైలర్

కంగువా సిని తొలి అర్థగంట బాగాలేదు : నటి జ్యోతిక

నాగ చైతన్య - శోభితల వెడ్డింగ్ కార్డు ఎలా ఉందో తెలుసా?

'ఆత్మకథ' రాయనున్న సూపర్ స్టార్... నిజమా?

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments