Webdunia - Bharat's app for daily news and videos

Install App

హేయ్ వల్లభా... రేవ్ పార్టీలో సీఐ అసభ్య నృత్యాలు, సస్పెన్షన్‌

Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (15:11 IST)
ఒక హోట‌ల్‌లో జన్మదిన వేడుకల్లో జరిగిన అసభ్య నృత్యాల్లో పాల్గొన్న సీఐపై సస్పెన్ష‌న్ వేటు పడింది. గుంటూరు నగరంలోని ఇన్నర్‌ రింగు రోడ్డు సమీపంలో ఉన్న తెలుగింటి రుచులు రెస్టారెంట్‌లో రాకేష్‌ అనే వ్యక్తి జన్మదిన వేడుకలు జరిగాయి. అయితే పార్టీలో భాగంగా తన స్నేహితులతో కలిసి మద్యం సేవించటంతో పాటు, విజయవాడ నుంచి పిలిపించిన ఆరుగురు యువతులతో అసభ్య నృత్యాలు కూడా చేశారు. 
 
ఈ పార్టీపై పక్కా సమాచారం అందుకున్న పట్టాభిపురం పోలీసులు దాడి చేసి మొత్తం 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కోవిడ్‌ నిబంధనలు అతిక్రమించటం, అధిక శబ్ధాలతో ఇతరులకు ఇబ్బంది కలిగించడం, దీంతో పాటుగా మద్యం సేవించటం, అసభ్యకరమైన నృత్యాలు చేసిన కేసు నమోదు చేసి, స్వంత పూచీకత్తులపై పంపించి చేశారు.

అయితే జరిగిన పార్టీలో అర్బన్‌ సీసీఎస్‌లో పని చేస్తున్న సీఐ వెంకటేశ్వర రావు కూడా ఉన్నారు. దీనితో పాటు ఒకేసారి ఆరుగురు యువతులు, 19 మంది యువకులను తీసుకుని రావటంతో రేవ్ పార్టీ జరిగిదట. ఇందులో సీ.ఐ. యువ‌తుల‌తో క‌ల‌సి నృత్య భంగిమ‌లు చేయ‌డం కూడా రికార్డు కావ‌డంతో ఆయ‌న‌పై జిల్లా పోలీసు అధికారి స‌స్పెన్ష‌న్ వేటు వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments