ఆధునిక పోకడలు, పరుగులు పెట్టే జీవనం, స్మార్ట్ ఫోన్ల యుగం, కంప్యూటర్లతో పొద్దస్తమానం గడిపేవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఉద్యోగాల పేరిట దంపతులు చిన్నారులను కూడా పట్టించుకోకుండా పరుగులు తీస్తున్నారు. ఫలితంగా తల్లిదండ్రుల నుంచి పొందాల్సిన ప్రేమ, ఆప్యాయతకు చిన్నారులు చాలావరకు దూరమవుతున్నారు.
ఎనిమిది గంటలు, తొమ్మిది గంటలు ఆఫీసులకే పరిమితమవుతున్న తల్లిదండ్రుల నుంచి పొందే ప్రేమను చాలా మిస్ అవుతున్నామనేందుకు ఓ చిన్నారి తనకు తెలిసి తెలియని భాషలో చెప్పే బాధకు ఈ వీడియోనే నిదర్శనం. ఉద్యోగానికి వెళ్లే హడావుడిలో అమ్మ తనకు ముద్దెట్టకుండానే వెళ్లిపోయిందని.. తన సోదరికి కూడా ముద్దెట్టలేదని.. రెండు మూడేళ్ల ప్రాయం వున్న బాలుడు ఇంట్లో వున్న తండ్రికి కంప్లైంట్ చేసే వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఆ వీడియో ముద్దుగా వుండే ఆ చిన్నారులు.. అమ్మ ఉద్యోగానికి వెళ్తూ వెళ్తూ.. ముద్దెట్టలేదని, పట్టించుకోలేదని రాని రాని మాటలతో ముద్దుగా చెప్తుంటే.. నెటిజన్లు అయ్యో పాపం అంటున్నారు. మరికొందరు క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకేముంది... మీరూ ఆ వీడియోను ఓ లుక్కేయండి.
Hahahahaha Mother left for work without kissing him and now he is complaining to his father