వాళ్లు అరిచి గీపెట్టినా మేము చేయాల్సింది చేస్తాం...

పార్లమెంట్ వేదికగా టీడీపీ, వైకాపా ఎంపీలు అరిచి గీపెట్టినా తాము చేయాల్సింది చేసి తీరుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఆయన ఈ మాటలను తనను కలిసిన వైకాపాకు చెందిన అరకు ఎంపీ కొత్తపల్లి గీతతో

Webdunia
గురువారం, 22 మార్చి 2018 (18:07 IST)
పార్లమెంట్ వేదికగా టీడీపీ, వైకాపా ఎంపీలు అరిచి గీపెట్టినా తాము చేయాల్సింది చేసి తీరుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఆయన ఈ మాటలను తనను కలిసిన వైకాపాకు చెందిన అరకు ఎంపీ కొత్తపల్లి గీతతో అన్నారు. అంతేకాకుండా, టీడీపీ, వైకాపాలు కేవలం రాజకీయ లబ్ధికోసమే ఇదంతా చేస్తున్నాయంటూ ఆయన మండిపడ్డారట.
 
పార్లమెంట్ భవనంలో ప్రధాని మోడీతో కొత్తపల్లి గీత కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 'ఆంధ్రప్రదేశ్‌కు మేం మేలు చేయాలనే ఉన్నాం. కానీ... టీడీపీ, వైసీపీ రాజకీయ లబ్ధి కోసం ఇదంతా చేస్తున్నాయి. చేసుకోనివ్వండి. ఎవరు ఎలా వ్యవహరించినా మేము మాత్రం ఏపీకి న్యాయం చేస్తాం. రైల్వే జోన్‌ ఏర్పాటు కూడా పరిశీలిస్తున్నాం' అని వ్యాఖ్యానించారని గీత చెప్పుకొచ్చారు.
 
తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు పూర్తిగా న్యాయం చేస్తానని, ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలను నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. ఈ విషయంలో వెనుకడుగువేసేది లేదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారని ఆమె వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Devi Sri Prasad: ఈసారైనా దేవీశ్రీ ప్రసాద్ హీరోగా క్లిక్ అవుతాడా, కీర్తి సురేష్ జంటగా చేస్తుందా...

Rahul: హాస్టల్లో ఉండే రోజుల్లో ది గర్ల్ ఫ్రెండ్ ఐడియా వచ్చింది: రాహుల్ రవీంద్రన్

ఉపాసన సీమంతంలో అల్లు అర్జున్ ఎక్కడ? ఎందుకు పక్కనబెట్టారు?

దేవ్ పారు నుంచి కాలభైరవ పాడిన నా ప్రాణమంత సాంగ్ లాంచ్

Arnold Schwarzenegger: వేటలో చిక్కుకున్న వేటగాడు కథతో ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments