Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కల నెరవేరిన ఆనంద క్షణాలివి : ఎల్కే అద్వానీ

Webdunia
ఆదివారం, 10 నవంబరు 2019 (11:44 IST)
వివాదాస్పద అయోధ్య వివాదానికి సుప్రీంకోర్టు శనివారం తెరదించింది. వివాదాస్పద అయోధ్య భూమిని రామజన్మభూమి న్యాస్‌కే కేటాయించాలని, మసీదు నిర్మాణం కోసం ప్రత్యేకంగా ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై బీజేపీ అగ్రనేత ఎల్కే.అద్వానీ స్పందించారు. 
 
ఈ తీర్పుతో హిందువుల చిరకాల కోరికైన అయోధ్య రామమందిర నిర్మాణ కల సాకారం కానుందని అన్నారు. తన దశాబ్దాల కల నెరవేరిందని, భారత సాంస్కృతిక, వారసత్వ సంపదలో రామజన్మభూమిది ప్రత్యేకమైన స్థానమని అన్నారు.
 
కోట్లాది మంది నమ్మకాలను నిలుపుతూ వచ్చిన ఈ తీర్పు తనకెంతో సంతోషాన్ని కలిగించిందని, ఇకపై ఎటువంటి హింసకూ తావులేకుండా శాంతిని నెలకొల్పేందుకు కృషి చేయాల్సి వుందని అద్వానీ అభిప్రాయపడ్డారు. 
 
అన్ని వర్గాల ప్రజలూ ఒక్కటై దేశ ఐక్యతను, సమగ్రతనూ బలపరచాలని కోరారు. మసీదు నిర్మాణానికి ఐదు ఎకరాలు కేటాయించాలన్న సుప్రీంకోర్టు తీర్పునూ అద్వానీ స్వాగతించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments