ప్రపంచం మహమ్మారి కరోనావైరస్‌తో పోరాడుతున్న నేపధ్యంలో ప్రజలలో భయాందోళనలు సృష్టించడానికి అనేక శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో చాలా తప్పుడు సందేశాలు షేర్ అవుతున్నాయి. అందులో ఒక దారుణమైన సందేశం నిన్నటి నుంచి చక్కెర్లు కొడుతోంది.
అదేమిటంటే... వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తులు రెండేళ్లలో చనిపోతారని ఒక చిత్రం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అయితే, ఈ వాదన పూర్తిగా నకిలీదని, టీకా పూర్తిగా సురక్షితం అని పిఐబి ఫాక్ట్ చెక్ ధృవీకరించింది.
సోమవారం, ఆరోగ్య మంత్రిత్వ శాఖ 21.80 కోట్లకు పైగా వ్యాక్సిన్ మోతాదులను రాష్ట్రాలకు అందించింది. 1.80 కోట్ల మోతాదులను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అందించాల్సి ఉంది. భారత ప్రభుత్వం ఇప్పటివరకు ఉచితంగా 21.80 కోట్లకు పైగా వ్యాక్సిన్ మోతాదులను అందించింది.