Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో మొదలైన పెళ్లిళ్ల సీజన్... 32 లక్షల వివాహాలు

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2022 (11:30 IST)
దేశంలో పెళ్ళిళ్ళ సీజన్ మొదలైంది. ఈ నెల 4వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు దాదాపు 32 లక్షల వివాహాలు జరుగనున్నాయి. ఈ పెళ్లిళ్ళ ద్వారా మొత్తంగా రూ.3.75 లక్షల వ్యాపారం జరుగుతుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒక్క ఢిల్లీలోనే 3.5 లక్షల వివాహాలు జరుగుతాయని కాన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) తెలిపింది. ఈ నెల 4వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ వివాహాల సీజన్‌లో 32 లక్షల వరకు వివాహాలు జరుగుతాయని తెలిపింది. ఈ సందర్భంగా రూ.3.75 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని ఆ సంస్థ పరిశోధనా విభాగం నిర్వహించిన ఓ సర్వే ఆధారంగా తేల్చింది. 
 
ముఖ్యంగా, దేశ వ్యాప్తంగా 35 నగరాల్లో 4302 మంది వ్యాపారులు, సర్వీస్ ప్రొవైడర్ల నుంచి ఈ వివాహాలను సేకరించింది. ఈ సీజన్‌లో ఒక్క ఢిల్లీలోనే 3.5 లక్షల వివాహాలు జరుగుతాయని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ వెల్లడించారు. ఈ వివాహాల ద్వారా రూ.75 వేల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. 
 
కాగా, గత యేడాది ఇదే సీజన్‌లో దేశంలో 25 లక్షల వివాహాలు జరిగాయని, వాటి ద్వారా రూ.3 లక్షల కోట్ల మేరకు వ్యాపారం జరిగిందని వివరించారు. ఈ సీజన్‌లో మొత్తంగా రూ.3.75 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరిగే అవకాశం ఉందజని ఈ సీజన్ ముగిసిన తర్వాత మళ్లీ జనవరి 14వ తేదీ నుంచి జూలై వరకు మళ్ళీ పెళ్ళిళ్ల సీజన్ కొనసాగుతుందని ఖండేల్వాల్ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments