Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మూడేళ్ళ వ‌ర‌కు కార్మికుల వేతనములు పెంచిన ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్‌

Chamber letter
, గురువారం, 15 సెప్టెంబరు 2022 (21:29 IST)
Chamber letter
గ‌త నెల‌రోజుల‌పాటు చిత్ర నిర్మాణ వ్య‌యం పెరుగుతుంద‌ని చెప్పి పెద్ద సినిమాల నిర్మాత‌లంతా షూటింగ్‌లు బంద్ చేశారు. ఆ త‌ర్వాత సెప్టెంబ‌ర్ 1నుంచి షూటింగ్‌లు షురూ చేశారు. ఇక ఎట్ట‌కేల‌కు కార్మికుల వేత‌నాలు, విధివిధానాలు ఈరోజు రాత్రి సెప్టెంబ‌ర్ 15న దిల్‌రాజు ఆధ్వ‌ర్యంలో క‌మిటీ ప్ర‌క‌టించింది.
 
తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కో-ఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ శ్రీ దిల్ రాజు ఆధ్వర్యంలో వాణిజ్య మండలి అధ్యక్షులు శ్రీ K. బసిరెడ్డి, గౌరవ కార్యదర్శి శ్రీ K.L. దామోదర్ ప్రసాద్, ప్రొడ్యూసర్స్ సెక్టార్ కౌన్సిల్ చైర్మన్ శ్రీ యేలూరు సురేందర్ రెడ్డి, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షులు శ్రీ. C.కళ్యాణ్, గౌరవ కార్యదర్శి శ్రీ. T. ప్రసన్న కుమార్, తెలంగాణ స్టేట్ చలన చిత్ర వాణిజ్య మండలి గౌరవ కార్యదర్శి శ్రీ కె. అనుపమ్ రెడ్డి, ఇతర కమిటీ సభ్యులు మరియు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షులు శ్రీ. వల్లభనేని అనిల్ కుమార్, జనరల్ సెక్రటరీ శ్రీ. P.S.N. దొర, కోశాధికారి సురేష్ లు పాల్గొన్న సమావేశములులో వేతనములు, విధివిధానములు అన్నియు ఖరారు అయ్యాయి.
 
తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి 2018 సంవత్సరములో చేసిన ఒప్పందంను అనుసరించి ఆ వేతనముల మీద పెద్ద సినిమాలకు 30%, చిన్న సినిమాలకు 15% పెంచేందుకు అంగీకరించడమైనదని, ఈ పెంచిన వేతనములు 01-07-2022 వ తేదీనుండి  30-06-2025 వరకు అమలులో ఉంటాయని, అలాగే ఏది చిన్న సినిమా అనేది చలన చిత్ర వాణిజ్య మండలి మరియు ఎంప్లాయిస్ ఫెడరేషన్ లతో కూడిన కమిటీ నిర్ణయిస్తుంది.
 
తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి                     తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి   
 
(K. బసిరెడ్డి) (K.L. దామోదర్ ప్రసాద్)                        (C. కళ్యాణ్)     (T. ప్రసన్న కుమార్)       
  అధ్యక్షులు       గౌరవ కార్యదర్శి                                         
                                                                                               అధ్యక్షులు       గౌరవ కార్యదర్శి
తెలంగాణ స్టేట్ చలనచిత్ర వాణిజ్య మండలి               తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్
(సునీల్ నారంగ్)   (K. అనుపమ్ రెడ్డి)                    (వల్లభనేని అనిల్ కుమార్) (P.S.N. దొర)
     అధ్యక్షులు         గౌరవ కార్యదర్శి                             అధ్యక్షులు           గౌరవ కార్యదర్శి

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Madhuri Dixit 55 ఏళ్లు దాటినా డ్యాన్స్ స్టెప్పులతో చంపేస్తున్న మాధురీ దీక్షిత్