అతడి ఒంట్లో కరెంట్ వుందా... తాకితే వెలుగుతున్న బల్బ్(Video)

Webdunia
శుక్రవారం, 26 జులై 2019 (21:20 IST)
మన ఇంట్లో బల్బ్ వెలగాలంటే పవర్ సప్లై ఉండాలి. ఫ్యాను తిరగాలంటే పవర్ కనెక్షన్ ఉండాలి. కానీ ఆదిలాబాద్ జిల్లా బేల మండలం  సిరసన్న రామనగర్ లోని చాంద్ పాషా ఇంట్లో మాత్రం కరెంటు లేకుండానే బల్బులు వెలుగుతూ ఉంటాయి. మీకు విచిత్రంగా అనిపించవచ్చు కానీ ఇది నిజం.. చాంద్ పాషాకి కొడుకు సమీర్, కూతురు సానీయా వున్నారు.
 
వారం క్రితం ఇంట్లో ఉన్న బల్బు చెడిపోవడంతో కొత్త బల్బు కొనుకొచ్చి దానిని బిగించే సందర్భంలో కొడుకు సమీర్‌ను పట్టుకోమని ఇవ్వడంతో సమీర్ టచ్ చేయగానే విద్యుత్ బల్బు వెలిగింది. ఆశ్చర్యపోయిన తండ్రి కుమార్తెకు సైతం పట్టుకోమని ఇవ్వడంతో బల్బు వెలిగింది. టచ్ చేస్తేనే కాదు ఆ పిల్లల మొహం మీద పెట్టినా, బుగ్గ మీద పెట్టినా... ఇలా శరీరం పైన ఎక్కడ పెట్టినా కూడా బల్బులు వెలుగుతున్నాయి.
 
దీంతో ఆశ్చర్యపోయిన తండ్రి చుట్టుప్రక్కల వారికి సమాచారం అందించాడు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా గ్రామస్తులకు తెలియడంతో ఈ వింతను చూడడానికి చాంద్ పాషా ఇంటికి క్యూ కడుతున్నారు ప్రజలు.. మీరు చూడండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harshali Malhotra: ఎనర్జీ కోసం ఉదయం దీనిని తాగమని ఆయన నాకు చెప్పేవారు: హర్షాలి మల్హోత్రా

'మన శంకర వరప్రసాద్ గారు'లో ఆ ఇద్దరు స్టార్ హీరోల స్టెప్పులు!

Chiranjeevi and Venkatesh: చంటి, చంటబ్బాయి పై మాస్ డ్యాన్స్ సాంగ్ చిత్రీకరణ

రజనీకాంత్ చిత్రంలో విజయ్ సేతుపతి!!

'మన శంకర వరప్రసాద్ గారు' అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తారు : అనిల్ రావిపూడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments