మొన్న విమానంలో.. నేడు ఆర్టీసీ బస్సులో.. మహిళపై మూత్ర విసర్జన చేసిన యువకుడు

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2023 (11:05 IST)
కొందరు యువకులు మహిళల పట్ల అసభ్యంగా, అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. మొన్నటికిమొన్న విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తన ముందు సీట్లో కూర్చొనివున్న ఓ వృద్ధురాలైన మహిళా ప్రయాణికురాలిపై మూత్రం పోశాడు. ఈ ఘటన పెను దుమారమే రేపింది. ఎయిరిండియా విమానంలో 70 యేళ్ల వృద్ధురాలిపై శంకర్ మిశ్రా అనే వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. ఇపుడు ఇలాంటి ఘటనే కర్నాటక ప్రభుత్వ రవాణా సంస్థకు చెందిన ఆర్టీసీ బస్సులో మంగళవారం జరగ్గా ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
విజయపుర నుంచి మంగుళూరుకు వెళుతున్న ఈ ఆర్టీసీ బస్సు హుబ్బళ్ళి సమీపంలోని కిరేసురులోని ఓ డాబా వద్ద ఆగింది. ప్రయాణికులంతా మూత్ర విసర్జన చేసేందుకు, టీ సేవించేందుకు బస్సు దిగారు. అయితే, 28వ నంబరు సీటులో కూర్చొనివున్న మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్న రామప్ప (25) అనే యువకుడు బస్సు ముందు వరుస సీట్లో కూర్చొనివున్న మహిళపై మూత్ర విసర్జన చేశాడు. గాఢ నిద్రలో ఉన్న ఆమె ఈ అకస్మాత్తు చర్యతో ఒక్కసారిగా ఉలిక్కిపడుతూ నిద్రలేకి బిగ్గరగా కేకలు పెట్టింది. దీంతో బస్సులోని మిగిలిన ప్రయాణికులంతా నిద్రలేచారు. 
 
లాగే, కిందకు దిగిన ప్రయాణికులంతా ఒక్కసారిగా బస్సులోకి వచ్చి, నిందితుడుని పట్టుకుని దేహశుద్ధి చేసి బస్సు నుంచి కిందకు దించేశారు. ఆ తర్వాత మహిళా ప్రయాణికురాలు డాబాలోని గదిలోకి వెళ్లి స్నానం చేసి వచ్చేంత వరకు బస్సును ఆపారు. పీకల్లోతు మద్యంమత్తులో ఉన్న రామప్ప.. దిక్కుతెలియక ఈ పాడుపనికి పాల్పడ్డాడు. అయితే, ఈ ఘటనపై మహిళ పెద్ద మనసుతో పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో ఎలాంటి కేసు నమోదు చేయలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Virat Karna,: నాగబంధం లో సెకండ్ సింగిల్ సుర సుర సాంగ్ చిత్రీకరణ

Naga Shaurya: నాకు అలాంటి లక్ రావాలని కోరుకుంటున్నా : నాగశౌర్య

Supriya : డెకాయిట్‌ క్లైమాక్స్ రిస్క్ అనిపించలేదు : సుప్రియ యార్లగడ్డ

Kiran Abbavaram: తిమ్మరాజుపల్లి టీవీ ఈతరం జెన్ జీ కిడ్స్ కు బాగా నచ్చుతుంది : వి. మునిరాజు

ఆప్ క్యూట్ హో... మోడల్ తాన్యా ఛటర్జీకి చాహల్ మెసేజ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుచ్చకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

మోచేతుల కింద నలుపు రంగు వదిలించుకునేదెలా?

కాహోకాన్ 2026 యొక్క 10వ ఎడిషన్‌ను ప్రారంభించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ఈ 5 జ్యూస్‌లు ఆరోగ్యానికి వరం

తమ రెండవ స్టోర్, సీజనల్ ఎడిట్‌తో వైజాగ్‌లో తమ కార్యకలాపాలను విస్తరించిన సోచ్

తర్వాతి కథనం
Show comments