Webdunia - Bharat's app for daily news and videos

Install App

బూట్లు అడుగు భాగంలో రూ.8 కోట్ల విలువ చేసే బంగారం.. ఎలాసాధ్యం?

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2023 (10:34 IST)
ఈ మధ్యకాలంలో హైదరాబాద్ నగరానికి తలమానికంగా ఉన్న శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ మొత్తంలో స్మగ్లింగ్ బంగారాన్ని ప్రయాణికుల నుంచి స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా రూ.8 కోట్ల విలువ చేసే బంగారాన్ని అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారాన్ని ఓ ప్రయాణికుడు తన బూట్లు అడుగు భాగంలో దాచి అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, సూడాన్ నుంచి వచ్చిన 23 మంది ప్రయాణికులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని కష్టమ్స్ అధికారులు నిశితంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో బూట్లు అడుగు భాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అరబల్లో 15 కేజీల బంగారం దాచిపెట్టినట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 
 
అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ రూ.15 కోట్ల మేరకు ఉంటుందని వారు వెల్లడించారు. దీనికి సంబంధించి నలుగురు ప్రయాణికులను అరెస్టు చేసిన అధికారులు వారి వద్ద లోతుగా విచారణ జరుపుతున్నారు. కాగా, ఇటీవలి కాలంలో ఇంత భారీ మొత్తంలో బంగారం పట్టుబడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments