Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్‌లో వీధి కుక్కల దాడిలో బాలుడి మృతి... మంత్రి కేటీఆర్ ఏమన్నారంటే..

Advertiesment
ktrao
, మంగళవారం, 21 ఫిబ్రవరి 2023 (20:37 IST)
హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరి హృదయం ద్రవించుకునిపోతుంది. దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇది ఎంతో విషాదకరమైన ఘటన అంటూ పేర్కొన్నారు. పైగా, ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. 
 
నిజామాబాద్ జిల్లా ఇందల్‌‍వాయి మండల కేంద్రానికి చెందిన ముత్యం గంగాధర్ అనే వ్యక్తి నాలుగేళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఆయన ఛే నెంబర్ చౌరస్తారో ఓ కారు సర్వీస్ సెంటరులో వాచ్‌మెన్‌గా పని చేస్తుండగా, భార్య జనప్రియ, 8 యేళ్ల కుమార్తె, 4 యేళ్ల కుమారుడు ప్రదీప్ ఉన్నారు. వీరంతా బాగ్ అంబర్‌పేటలోని ఎరుకల బస్తీలో నివాసం ఉంటున్నారు. 
 
అయితే, ఆదివారం సెలవు కావడంతో పిల్లలిద్దరినీ వెంటబెట్టుకుని తాను పనిచేస్తున్న సర్వీస్ సెంటరుకు గంగాధర్ తీసుకెళ్లాడు. కుమార్తెను పార్కింగ్ ఏరియాలో ఉంచి కుమారుడిని మాత్రం లోపలికి తీసుకెళ్లాడు. ప్రదీప్ అక్కడే ఆడుకుంటుండగా గంగాధర్ మాత్రం తన పనుల్లో నిమగ్నమయ్యాడు.
webdunia
 
ఈ క్రమంలో బాలుడు అక్క కోసం క్యాబిన్ వైపు నడుచుకుంటూ వస్తుండగా, ఒక్కసారిగా వీధి కుక్కలు వెంటపడ్డాయి. దీంతో భయపడిన బాలుడు వాటి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించి అటూ ఇటూ పరుగెత్తాడు. కానీ, ఎంతకీవదలని శునకాలు మాత్రం ఒకదాని తర్వాత మరొకటి దాడి చేయడంతో ఆ బాలుడు కిందపడిపోయాడు. 
 
తమ్ముడు ఆర్తనాదాలు విన్న అక్క తండ్రికి విషయం చెప్పడంతో అతను పరుగెత్తుకుంటూ వచ్చి కుక్కలదాడిలో తీవ్రంగా గాయపడిన కుమారుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ప్రదీప్ అప్పటికే మరణించినట్టు వైద్యులు చెప్పడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
 
ఈ హృదయ విదారక ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఇలాంటి బాధాకరమైన మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతి మున్సిపాలిటీ పరిధిలోని వీధి కుక్కల సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. కుక్కల జనాభా పెరగకుండా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. జంతు సంరక్షణ కేంద్రాలు, జంతు జనన నియంత్రణ కేంద్రాలను కూడా ఏర్పాటుచేశామని వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టర్కీలా.. భారత్‌లో శక్తివంతమైన భూకంపం.. శాస్త్రవేత్త హెచ్చరిక