Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టర్కీలా.. భారత్‌లో శక్తివంతమైన భూకంపం.. శాస్త్రవేత్త హెచ్చరిక

earthquake
, మంగళవారం, 21 ఫిబ్రవరి 2023 (19:06 IST)
టర్కీ భూకంపం నేపథ్యంలో.. భారత్‌లో ఇలాంటి శక్తివంతమైన భూకంపం ఏర్పడే అవకాశం వుందని.. హైదరాబాద్‌లోని జాతీయ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NGRI) శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ పూర్ణచంద్రరావు హెచ్చరించారు. భూమి ఉపరితలం నిరంతరం కదలికలో ఉండే వివిధ పలకలను కలిగి ఉంటుంది. భారత ఫలకం సంవత్సరానికి 5 సెం.మీ కదులుతోంది. 
 
ఇది హిమాలయాల వెంబడి ఒత్తిడి పేరుకుపోవడానికి దారితీస్తుంది. ఫలితంగా శక్తివంతమైన భూకంపం ఏర్పడే అవకాశం వుందని తెలిపారు. హిమాలయ ప్రాంతం అధిక భూకంపాల ముప్పు జోన్‌లో వుంది. 
 
గతంలో 1720లో కుమావన్ భూకంపం 1803లో గర్వాల్ భూకంపం వంటి భారీ విపత్తులు సంభవించాయి. కానీ గత వందేళ్ల కాలంలో 9 లేకుంటే అంత కంటే ఎక్కువ తీవ్రతతో భూకంపాలు సంభవించిన దాఖలాలు లేవు. 1991లో ఉత్తరకాశీ, 1999 చమోలీ భూకంపాలు కూడా తక్కువ తీవ్రతతో కూడుకున్నవే. 
 
ఈ ప్రాంతం నిరంతరం ఒత్తిడికి గురవుతోందని.. భూకంపం ద్వారా మాత్రమే అది విడుదల అవుతుందని చెప్పుకొచ్చారు. ఇది భూకంపాలకు దారి తీస్తుందని చెప్పారు. 
 
అయితే, ఈ భూకంపం తేదీ, సమయాన్ని అంచనా వేయలేమని, విధ్వంసం ఒక భౌగోళిక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారే బహుళ కారకాలపై ఆధారపడి ఉంటుందని పూర్ణచంద్రరావు వెల్లడించారు
 
బద్రీనాథ్, కేదార్‌నాథ్ వంటి పుణ్యక్షేత్రాలకు ముఖద్వారంగా భావించే జోషిమఠ్‌లో ఇటీవల భూమి క్షీణించిన నేపథ్యంలో పూర్ణచంద్రరావు వ్యాఖ్యలకు ప్రాధాన్యతను సంతరించుకుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గన్నవరంలో 114 సెక్షన్ - ఠాణాలో టీడీపీ నేత పట్టాభి