Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలకు కరోనా సోకడం మంచిదే : ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా

Webdunia
మంగళవారం, 20 జులై 2021 (09:46 IST)
అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) అధిపతి రణ్‌దేప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇపుడు వివాదాస్పదంగా మారాయి. కరోనా వైరస్ బారినపడకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి. ముఖ్యంగా, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని సలహా ఇస్తున్నాయి. అయితే, రణ్‌దీప్ గులేరియా మాత్రం పిల్లలు వైరస్ బారిన పడటం మంచిదేనని అంటున్నారు. దీనివల్ల చాలామంది పిల్లల్లో సహజ రోగనిరోధక శక్తి పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. 
 
అంతేకాకుండా, ఆయా రాష్ట్రాల్లోని స్థానిక పరిస్థితులను బేరీజువేసి దశలవారీగా విద్యా సంస్థలను తెరుచుకోవచ్చని, స్కూల్స్ మూసివేత పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. కేసులు తక్కువగా ఉన్న జిల్లాలలో స్కూల్స్ తెరువవచ్చని కరోనా పాజిటివ్ రేటు 5 శాతం కన్నా తక్కువగా ఉన్న జిల్లాలలో ఓపెన్ చేయటానికి ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆయన సలహా ఇచ్చారు.
 
అదేసమయంలో ఒక వేళ కరోనా కేసులు పెరిగిన పక్షంలో స్కూల్స్‌ను మూసివేయడం, రోజు విడిచి రోజు స్కూళ్లకు విద్యార్థులను రప్పించటం వంటి పద్ధతులను పాటించే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలని కోరారు. ముఖ్యంగా, మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటివి స్కూళ్లలో ఉండాలన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్ మృతి

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

టీలు, కాఫీలకు బదులు ఈ జావ తాగరాదూ?

తర్వాతి కథనం
Show comments