Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేనియల్స్‌తో ట్రంప్ శారీరక సంబంధాలు నిజమే: న్యూయార్క్ మాజీ మేయర్

పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు శారీరక సంబంధాలున్నట్లు ఇన్నాళ్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తల్లో నిజం లేదని ట్రంప్ సన్నిహితులు కొట్టిపారేస్తున

Webdunia
శుక్రవారం, 4 మే 2018 (09:03 IST)
పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు శారీరక సంబంధాలున్నట్లు ఇన్నాళ్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ వార్తల్లో నిజం లేదని ట్రంప్ సన్నిహితులు కొట్టిపారేస్తున్న వేళ.. డేనియల్స్‌కు ట్రంప్‌కు సంబంధాలున్నట్లు న్యూయార్క్ మాజీ మేయర్ రుడీ గిలియానీ ధ్రువీకరించారు. డేనియల్స్‌తో శారీరక సంబంధం కొనసాగించినందుకు ట్రంప్ ఆమెకు డబ్బులను చెల్లించినట్లు గిలియానీ తేల్చి చెప్పారు. 
 
అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ ఎన్నిక కాకముందు ఫోర్న్ స్టార్ట్ స్టార్మీ డేనియల్‌తో వివాహేతర సంబంధాన్ని కొనసాగించినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని బయటకు రాకుండా ఉంచేందుకు ట్రంప్ తనతో ఒప్పందం కుదుర్చుకొన్నాడని ఫోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్ (స్టెఫానీ క్లిఫార్డ్) స్పష్టం చేశారు.  ఈ విషయమై అమెరికాలో పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. 
 
అయితే ఈ ఆరోపణలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ తరుణంలో న్యూయార్క్ మాజీ మేయర్ రుడీ గిలియానీ చేసిన ప్రకటన ట్రంప్‌కు కొత్త చిక్కు తెచ్చిపెట్టింది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టక ముందే ఫోర్న్‌స్టార్ స్టార్మీ డేనియల్స్‌తో ట్రంప్‌కు శారీరక సంబంధాలున్నాయి. ఈ విషయాన్ని ఫోర్న్ స్టార్ ఇటీవల కాలంలో వెల్లడించినా.. దీన్ని వైట్‌హౌస్ ఖండించింది.
 
అంతేగాకుండా అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ట్రంప్ తన లాయర్ ద్వారా ఫోర్న్‌స్టార్ స్టెఫానీ క్లిఫార్డ్‌కు రూ.1,30,000 డాలర్లను చెల్లించినట్టుగా న్యూయార్క్ మాజీ మేయర్ రుడి గిలియానీ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం