ఆడవారు బౌద్ధంలోకి రావడం మొదలైతే ఇక అంతేనని చెప్పిన బుద్ధుడు... ఎందుకని?
గౌతమ బుద్ధుడు బోధనలు మానవుడి జీవితానికి ఎంతో ముఖ్యమైనవి. బుద్ధ పౌర్ణమ సందర్భంగా సిద్ధార్థుడు చెప్పిన కొన్ని బోధనలు చూద్దాం. సంసారము దుఃఖమయము, తృష్ణ దుఃఖ కారణము. తృష్ణ నశించిన, దుఃఖము నశించును. రాగ ద్వేష అహంకారములను వదిలిన జీవులు ముక్తులవుతారు. 1. స
గౌతమ బుద్ధుడు బోధనలు మానవుడి జీవితానికి ఎంతో ముఖ్యమైనవి. బుద్ధ పౌర్ణమ సందర్భంగా సిద్ధార్థుడు చెప్పిన కొన్ని బోధనలు చూద్దాం. సంసారము దుఃఖమయము, తృష్ణ దుఃఖ కారణము. తృష్ణ నశించిన, దుఃఖము నశించును. రాగ ద్వేష అహంకారములను వదిలిన జీవులు ముక్తులవుతారు.
1. సత్యము 2. నమ్రత 3. సదాచారము 4. సద్‌విచారము 5. సద్గుణము 6. సమృద్ధి 7. ఉన్నతమైన లక్ష్యము 8. ఉత్తమమైన ధ్యానము ఈ ఎనిమిది సాధనములను బుద్ధ భగవానుడు మానవుల ఉన్నతి కోసం చెప్పాడు.
అంతేకాదు ఆయన చెప్పినవాటిలో మరీ ముఖ్యమైన విషయం ఒకటి వుంది. అదేమిటంటే... ఆడవారు కూడా తాను స్థాపించిన బౌద్ధంలోకి రావడం మొదలయ్యాక 2500 సంవత్సరాలపాటు మనగలిగిన బౌద్ధం కాస్తా 500 సంవత్సరాలపాటు మాత్రమే ఉంటుందట. ఇలా ఎందుకు జరుగుతుందన్నది వేరే చెప్పక్కర్లేదు.
బుద్ధుని మతమైన బౌద్ధ మతంలో దాదాపు నలభై వేల మంది సన్యాసినులు ఉండేవారు. వీరి సంఖ్య పురుష సన్యాసుల కంటే ఎక్కువ. ఆడ మరియూ మగ సన్యాసుల నిష్పత్తి 3:1లో ఉండేదట. ఇకపోతే బుద్ధునికి బీహారులోని బోధ్ గయ ప్రాంతంలో జ్ఞానోదయమైంది. ఆ ప్రాంతాన్ని ప్రభుత్వం సంరక్షిస్తోంది కానీ బోధి చెట్టు మాత్రం కాలగర్భంలో కలిసిపోయింది. ఐతే ఆ చెట్టు యొక్క ఒక కొమ్మని అశోకుడు శ్రీలంకకి పంపాడట. అలా బౌద్ధ మత వ్యాప్తికి అశోక చక్రవర్తి తోడ్పాటునందించాడు. అక్కడి చెట్టు కొమ్మ నుంచి వచ్చిన మరో కొమ్మే గయలో వున్న బోధి చెట్టు అని చెప్తారు.