గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు....
గర్భం దాల్చడం అనేది స్త్రీకి భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప వరం. అయితే స్త్రీ గర్భం దాల్చినప్పుడు తన ఆరోగ్యం విషయంలో చాలావరకు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎలాంటి ఆహారం తీసుకోవచ్చో, ఎలాంటి ఆహారం తీసుకోకూడదో అని కొంతమంది సరిగా తినకుండా ఉంటారు. ఈ విషయంలో జాగ్రత్త
గర్భం దాల్చడం అనేది స్త్రీకి భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప వరం. అయితే స్త్రీ గర్భం దాల్చినప్పుడు తన ఆరోగ్యం విషయంలో చాలావరకు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎలాంటి ఆహారం తీసుకోవచ్చో, ఎలాంటి ఆహారం తీసుకోకూడదో అని కొంతమంది సరిగా తినకుండా ఉంటారు. ఈ విషయంలో జాగ్రత్త కొంతవరకు అవసరమే. ముఖ్యంగా డైటింగ్ లాంటివి చేయకూడదు. ఆహారం విషయంలో వైద్యుల సలహా తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ సమయంలో తగినంత బరువు ఉండకపోతే నెలలు నిండకముందే ప్రసవించే అవకాశాలు ఉంటాయని అధ్యయనంలో తేలింది. అంతేకాకుండా సిజేరియన్ చేయాల్సిన అవకాశం ఏర్పడుతుందని వెల్లడయ్యింది.
ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్శిటీ పరిశోధకులు ప్రపంచవ్యాప్తంగా 13 లక్షల మంది గర్భిణులపై పరిశోధనలు చేశారు. ఆ ఫలితాలను పరిశీలిస్తే అందులో సగంకన్నా ఎక్కువమంది ఉండాల్సిన దానికన్నా అధిక బరువు ఉన్నారు. పావు శాతం మంది ఉండాల్సిన బరువుకన్నా చాలా తక్కువ ఉన్నారని వెల్లడయ్యింది. ప్రెగ్నెన్సీ నిర్థారణ అయ్యాక తగినంత బరువు పెరగడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. లేదంటే నెలలు నిండకుండా ప్రసవం అయ్యే ప్రమాదం ఉందని పరిశోధనకు నేతృత్వం వహించిన హెలెన్ టీడ్ అంటున్నారు.