Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త నుంచి విడాకులు కోరిన జైపూర్ రాజకుమారి

Webdunia
ఆదివారం, 9 డిశెంబరు 2018 (16:39 IST)
జైపూర్ రాజకుమారి విడాకులు కోరారు. తన భర్త నుంచి తనకు విడాకులు ఇప్పించాలని ఆమె కోర్టును ఆశ్రయించారు. హిందూ వివాహ చట్టం 13బి సెక్షన్ ప్రకారం గాంధీ నగర్‌లోని కుటుంబ కోర్టులో ఆమె విడాకుల పిటిషన్‌ను దాఖలు చేశారు. ఆమె పేరు దియా కుమారి. ఈమె కేవలం రాజకుమారిగానే కాకుండా సవాయి మాధోపూర్ ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతున్నారు.
 
జైపూర్‌ మహారాజు భవానీ సింగ్‌ కుమార్తె అయిన దియా కుమారి నరేంద్ర సింగ్‌ను పెళ్లి చేసుకున్నారు. తొమ్మిదేళ్ల పాటు డేటింగ్‌ చేసిన ఈ జంట 1997లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే గత కొంత కాలంగా వీరి మధ్య  మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. దీంతో 21 ఏళ్ల తర్వాత ఈ జంట విడిపోనున్నది. ఇందుకోసం కోర్టులో పిటిషన్ దఖాలు చేయగా, అందులో పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. 
 
కాగా, గత ఎన్నికల్లో బీజేపీ తరపున గెలిచిన ఆమె.. తాజాగా జరిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పోటీకి దూరంగా ఉన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల పోటీకి దూరంగా ఉన్నానని ప్రకటించడంతో ఆమె స్థానంలో ఆశా మీనా అనే కొత్త అభ్యర్థికి బీజేపీ అధిష్టానం అవకాశం కల్పించింది. అయితే లోక్‌సభ అభ్యర్థిగా దియాను రంగంలోకి దింపాలనే ఉద్దేశంతోనే బీజేపీ నాయకత్వం కొత్త అభ్యర్థికి అవకాశం ఇచ్చినట్లుగా స్థానిక నేతలు అప్రాయపడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments