Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీజేపీకి గ్లామర్ : లోక్‌సభ బరిలో మాధూరీ దీక్షిత్

Advertiesment
బీజేపీకి గ్లామర్ : లోక్‌సభ బరిలో మాధూరీ దీక్షిత్
, గురువారం, 6 డిశెంబరు 2018 (17:12 IST)
వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ సమాయత్తమవుతోంది. ఇందుకోసం బాలీవుడ్ గ్లామర్ జోడిస్తోంది. ఇందులోభాగంగా వచ్చే ఎన్నికల్లో అనేక మంది బాలీవుడ్ సినీ ప్రముఖులను బరిలోకిదించాలని ఆ పార్టీ భావిస్తోంది. అందుకోసం అవసరమైన క్షేత్రస్థాయి కసరత్తు కూడా చేస్తోంది. 
 
ఆ పార్టీ తరపున ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఎంపీలుగా ఉన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మరికొంతమందికి టిక్కెట్లు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. పలువురు బాలీవుడ్ అందాల భామ మాధురీ దీక్షిత్‌కు బీజేపీ టిక్కెట్ ఇవ్వాలని భావిస్తోంది. ఇదే అంశంపై ఆ పార్టీ చీఫ్ అమిత్ షా సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. 
 
నిజానికి ఈ యేడాది జూన్ నెలలో "సంపర్క్ ఫర్ సమర్థన్" అనే కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమం కోసం ముంబైకు వెళ్లిన బీజేపీ చీఫ్ అమిత్ షా.. మాధూరీ దీక్షిత్‌తో సమావేశమైన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే ఆమె పేరును వచ్చే లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో చేర్చాలని నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గీత గోవిందం.. విషయంలో అలా జరగలేదు..