Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశ తన తండ్రికి ఫోన్ చేయలేదు, అందుకే అలా అయింది: కామారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ శోభ

Webdunia
బుధవారం, 11 డిశెంబరు 2019 (17:45 IST)
దిశ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కుదిపేసింది. ఈ ఘటనపై గతంలో తెలంగాణ డిప్యూటీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ శోభ చేరిపోయారు. దిశకు తన తల్లిదండ్రులతో సఖ్యత లేకపోవడంతోనే ఆపద సమయంలో వారికి ఫోన్ చేయకుండా తన సోదరికి ఫోన్ చేసిందనీ, అందుకే అలా చిక్కుకుపోయిందని అన్నారు. 
 
ఆ సమయంలో ఆమె తన చెల్లికి బదులు తండ్రికి ఫోన్ చేసి వుంటే ఆయన కాపాడే అవకాశం వుండేదన్నారు. గెజిటెడ్ ఆఫీసర్ అయిన దిశ అలా భయపడాల్సింది కాదనీ, ఆమె పోలీసులకి ఫోన్ చేసి వుండాల్సిందన్నారు. తల్లిదండ్రులు ఆమెకి చిన్నప్పట్నుంచి ధైర్యం నూరిపోయలేదనీ, అందుకే ఆమె అలా భయపడిందని వ్యాఖ్యానించారు. మహిళలపై అత్యాచార ఘటనల నేపథ్యంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పై వ్యాఖ్యలు చేశారు. ఇపుడీ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments