Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ 'దేవదాసు' దిలీప్ కుమార్ ఇక లేరు

Webdunia
బుధవారం, 7 జులై 2021 (10:30 IST)
బాలీవుడ్‏ లెజెండరీ యాక్టర్ దిలీప్ కుమార్ (98) బుధవారం (జూలై 7న) తుదిశ్వాస విడిచారు. జూన్ 30వ తేదీన ఆయన శ్వాస సంబంధిత సమస్యలతో ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేరగా, ఊపిరితిత్తుల్లో చేరిన నీటిని తొలగించారు.
 
దాంతో దిలీప్ కుమార్ ఆరోగ్యం మెరుగుపడిందని.. ప్రస్తుతం బాగున్నారని ఇటీవల ఆయన భార్య సైరా భాను సోషల్ మీడియా వేదికగా పేర్కోన్నారు. మళ్లీ ఆయన అనారోగ్యం బారిన పడటంతో ఈరోజు ఉదయం 07.30కి కన్ను మూశారు.  
దిలీప్ కుమార్ అసలు పేరు మహమ్మద్ యూసఫ్ ఖాన్. 1922 డిసెంబర్ 11 పెషావర్‌లో జన్మించారు. 8సార్లు ఉత్తమ ఫిలింఫేర్ అవార్డు అందుకున్న దిలీప్ కుమార్ మొగలి ఏ ఆజమ్, క్రాంతి, రామ్ ఔర్ శ్యాం, ఖర్మ, అందాజ్ వంటి హిట్ చిత్రాల్లో నటించారు. 1991లో దిలీప్ కుమార్‌ పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. 
1994లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. 1955 దేవదాసు చిత్రంతో దిలీప్ కుమార్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు. 2015 దిలీప్ కుమార్‌కు పద్మవిభూషణ్ పురస్కారం. కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న ఆయన  చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు హిందూజా ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. 
 
ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న ఆయన గత నెల ఆరో తేదీన శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments