Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సైకిల్ గర్ల్' ఇంట విషాదం: కార్డియాక్ అరెస్ట్‌తో తండ్రి మృతి

Webdunia
మంగళవారం, 1 జూన్ 2021 (15:47 IST)
Cycle girl
గతేడాది లాక్‌డౌన్ సమయంలో ఆరోగ్యం బాగాలేని తన తండ్రిని సైకిల్ మీద కూర్చొపెట్టుకొని 1200 కిలోమీటర్లు తీసుకెళ్లడంతో జ్యోతి కుమారి పేరు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా మారుమోగింది. ప్రస్తుతం ఆరోగ్యం బాగాలేని తన తండ్రిని సైకిల్ మీద 1200 కిలోమీటర్లు తీసుకెళ్లిన జ్యోతి కుమారి.. సోమవారం తన తండ్రిని కోల్పోయింది. జ్యోతికుమారి తండ్రి కార్డియాక్ అరెస్ట్‌తో మరణించారు. 
 
వివరాల్లోకి వెళితే.. బీహార్‌‌లోని దర్బంగాకు చెందిన జ్యోతికుమారి తండ్రి మోహన్ పాశ్వాన్ గురుగ్రాంలో ఆటో అద్దెకు తీసుకొని డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే ఊహించని రోడ్డు ప్రమాదంలో ఆమె తండ్రి తీవ్రగాయాలపాలయ్యాడు. దానికి తోడు లాక్‌డౌన్ కావడంతో కుటుంబం గడవడం కూడా కష్టమైంది. దాంతో జ్యోతికుమారి ఫ్యామిలీ మొత్తం స్వస్థలానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ లాక్‌డౌన్ కావడంతో స్వగ్రామానికి వెళ్లడానికి బస్సులు లేకపోవడంతో.. జ్యోతికుమారి తన తండ్రిని సైకిల్ మీద కూర్చొపెట్టుకొని ఏడు రోజులపాటు కష్టపడి 1200 కిలోమీటర్ల దూరంలోని దర్బంగాకు చేరుకుంది.
 
జ్యోతికుమారి తన తండ్రి కోసం చేసిన సాహసం చూసి దేశం మొత్తం ఆశ్చర్యపోయింది. పలువురు ప్రముఖులు జ్యోతికుమారికి చదువు చెప్పిస్తామని, సైకిల్ రేస్ పాల్గొనేలా చేస్తామని, ఆమె కుటుంబానికి ఆర్థికసాయం చేస్తామని.. ఇలా ఎంతోమంది ముందుకొచ్చారు. చివరికి ఈ విషయం అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు.. ఇవాంక ట్రంప్ దృష్టికి కూడా వెళ్లింది. ఇవాంక కూడా జ్యోతి చేసిన సాహసాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

హీరో విశాల్‌కు పెళ్లి కుదిరింది.. వధువు ఎవరంటే?

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments