Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాజపా 'యడ్డి'కి వెరీగుడ్డు కాలమేనా? కర్నాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జంపింగే జంపింగ్...

Webdunia
శనివారం, 6 జులై 2019 (14:54 IST)
కర్నాటక భాజపాకి మంచికాలం వచ్చేసినట్లే కనిపిస్తోంది. త్వరలో యడ్యూరప్ప ఆశ నెరవేరబోతుందన్న ప్రచారం ఊపందుకుంది. ఇంతకీ అక్కడ ఏం జరుగుతుంది...? తాజా సమాచారాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి భాజపాలో చేరేందుకు సిద్ధంగా వున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీనితో అధికార కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ఏ క్షణానైనా కూలిపోతుందని చెపుతున్నారు. 
 
ఇప్పటికే కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బహిరంగంగా కాంగ్రెస్ పార్టీ పట్ల వున్న తమ అసంతృప్తిని వ్యక్త పరిచారు. తాము రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇదే కనుక జరిగితే కుమారస్వామి సర్కార్ మైనారిటీలో పడిపోతుంది. భాజపా సంఖ్యాబలం నిరూపించుకోవాలని కోరవచ్చు. 
 
ఫలితంగా 13 నెలల కర్నాటక సంకీర్ణ ప్రభుత్వానికి కాలం చెల్లిపోవచ్చు. ఇదంతా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితమేనంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలను పాతాళానికి తొక్కేసింది బీజేపీ. అక్కడ మొత్తం 28 ఎంపీ స్థానాలకు గానూ 25 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. దీనితో ఇక కాంగ్రెస్-జేడీఎస్ పనైపోయినట్లేనని అప్పట్లోనే చెప్పుకున్నారు. ఇక ఇప్పుడు అది నిజం కాబోతున్నట్లు అర్థమవుతుంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments