Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కిలో దోశె పిండి కొనుగోలు చేస్తే ఒక బిందె నీరు ఉచితం!

Advertiesment
కిలో దోశె పిండి కొనుగోలు చేస్తే ఒక బిందె నీరు ఉచితం!
, సోమవారం, 1 జులై 2019 (11:13 IST)
చెన్నై మహానగరంలో తీవ్రమైన నీటీ ఎద్దడి నెలకొంది. తాగేందుకు కూడా బిందెడు నీటి కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం రేయింబవుళ్లు శ్రమిస్తోంది. ఇందుకోసం పొరుగు జిల్లాల నుంచి కూడా నీటిని తరలించే చర్యలను చేపట్టనుంది. 
 
ఈ క్రమంలో చెన్నై నగరానికి చెందిన ఓ వ్యాపారికి వినూత్న ఆలోచన ఒకటి వచ్చింది. తన దుకాణంలో కిలో దోశె పిండి కొనుగోలు చేస్తే ఒక బిందెనీరు ఉచితం అంటూ ఓ ప్రకటన బోర్డును ఏర్పాటు చేశాడు. తద్వారా నీటి సమస్యతో బాధపడేవారికి నీటిని ఇవ్వడంతో పాటు... తన వ్యాపారాన్ని కూడా రెట్టింపు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని భావించాడు. ఈ ఫ్లెక్సీ ఇపుడు ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తోంది.
 
ఈ ప్రకటన బోర్డుతో ఇప్పుడతని దుకాణం కస్టమర్లతో కిటకిటలాడుతోంది. తాను 24 సంవత్సరాలుగా ఈ దుకాణం సాగుతున్నానని, నీరు ఉచితమన్న తరువాత అమ్మకాలు బాగా పెరిగాయని దుకాణం యజమాని అంటున్నారు. ఈ ఒక్క సంఘటనే చెన్నై నగరంలో నెలకొన్న నీటి ఎద్దడి తీవ్రతను కళ్లకు కడుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుడ్ న్యూస్... గ్యాస్ సిలిండర్ పైన రూ. 100 తగ్గింపు