ఆ పశువులు ఓన్లీ చికెన్, మటన్, ఫిష్ ఫ్రై మాత్రమే తింటాయట!

Webdunia
మంగళవారం, 22 అక్టోబరు 2019 (16:45 IST)
గోవాలోని ఆ పశువులు గ్రాసం మాత్రం తినవు. ఓన్లీ చికెన్ మాత్రమే తింటాయంటే నమ్ముతారా..? నమ్మితీరాల్సిందే. గోవాలో రోడ్డుపై పడిన పశువులు పనాజీలోని గోశాలలో పరిరక్షించబడుతున్నాయి. రోడ్డుపై తిరుగుతూ వుండిన ఆ ఆవులు రోడ్డుపై లభించే ఆహారాన్ని తింటూ వచ్చాయి. వీటిలో చికెన్, మటన్, ఫిఫ్ ఫ్రైలు తింటూ ఎక్కువగా తినేవని తెలిసింది. 
 
సాధారణంగా పశువులు గ్రాసాన్ని మాత్రమే తీసుకుంటాయి. కానీ ఈ పశువులు మాత్రం చికెన్, మటన్, చేపలు మాత్రమే తింటున్నాయి. రోడ్డుపై నున్న హోటళ్ల నుంచి బయటపడే చికెన్, మటన్, తిన్న గోవులు.. గోశాలలో వేసే గ్రాసాన్ని తినట్లేదని అధికారులు తెలిపారు. ఈ పద్ధతిని మార్చేందుకు గోశాల అధికారులు చికిత్స ప్రారంభించారని గోవా మంత్రి మైకేల్ తెలిపారు. 
 
మాంసాహారం నుంచి శాకాహారం తీసుకునేలా అందించే చికిత్స ద్వారా గోవులు శాకాహారుగా మారుతాయని చెప్పారు. సాధారణంగా గోవులు మాంసాహారాన్ని ముట్టుకోవు. ఇళ్ళల్లో పెంచే ఆవులు మిగిలిన అన్నం, గంజినీళ్లు వంటివి తాగుతుంటాయి. గోవులకు అందించే ఆహారంలో ఏమాత్రం మాంసాహారం కలపటం చేయరు. అది పాపమని చెప్తుంటారు. 
 
కానీ ప్రస్తుతం గోవులు మాంసాహారాన్ని యధేచ్ఛగా తీసుకుంటున్నాయి. అలా రోడ్డుపై వుంటూ మాంసాహారాన్ని తీసుకునేందుకు అలవాటు పడిన గోవులకు గోవాలోని గోశాలలో శాకాహారాన్ని తీసుకునేలా చికిత్స చేస్తున్నారని మంత్రి మైకేల్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: నయనతార నో ప్రమోషన్ పాలసీని బ్రేక్ చేసిందా? ట్రోల్స్ మొదలు

Niharika: టికెట్ ధ‌ర‌ను రూ.100గా ఫిక్స్ చేసిన రాకాస‌ మేక‌ర్స్‌

Varun Tej : కొరియన్ కనకరాజు కోసం కొరియన్, తెలుగు మిక్స్ సాంగ్ చేస్తున్న థమన్

Decoit Review: లాజిక్ లేని అడివి శేష్ డెకాయిట్ మూవీ - డెకాయిట్ జన్యూన్ రివ్యూ

Satyadev :రావు బహదూర్ నుంచి సత్యదేవ్, దీపా థామస్‌ పై రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కలబంద రసం ఆరోగ్య రహస్యాలు

హైబీపీ వుందా? ఐతే ఈ ఫ్రూట్స్ తిని చూడండి

మహిళల పాదరక్షలపై క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రవేశపెట్టిన పారాగాన్

పాలుతో పాటు తినకూడని పదార్థాలు ఏమిటి?

తమ కొత్త ప్రచారానికి రుక్మిణి వసంత్‌ను ఎంచుకున్న తనిష్క్

తర్వాతి కథనం
Show comments