Webdunia - Bharat's app for daily news and videos

Install App

అణ్వాయుధం కంటో కరోనాతోనే అపార నష్టం : ఆనంద్ మహీంద్రా

Webdunia
మంగళవారం, 1 జూన్ 2021 (14:07 IST)
ఎపుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా దేశానికి కరోనా వైరస్ కలిగిస్తున్న నష్టంపై ఆందోళన వ్యక్తం చేశారు. అణ్వాయుధాలతో కలిగే నష్టం కంటే.. కరోనా వైరస్ కారణంగా కలిగిన నష్టమే అధికంగా ఉందన్నారు. 
 
'కరోనా చైనా శాస్త్రవేత్తల సృష్టే' అనే మీడియా కథనాన్ని కూడా ఆయన షేర్ చేస్తూ, కరోనా ఎక్కడ పుట్టిందనే విషయాన్ని మనం ఎప్పటికీ తెలుసుకోలేమన్నారు. ప్రస్తత పరిస్థితుల్లో అణు వ్యాప్తి నిరోధక ఒప్పందం మాదిరిగానే... జీవాయుధాలు, ప్రమాదకర పరిశోధనల నిరోధక ఒప్పందాన్ని కూడా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 
 
కరోనా పుట్టి ఏడాదికి పైగా సమయం గడిచిపోయిందని... అయినప్పటికీ ఇంతవరకు మనం దాని మూలాలను కనుక్కోలేకపోయామని బ్రిటన్ పత్రిక 'డైలీ మెయిల్' తెలిపింది. సార్స్ కోవ్-2 వైరస్‌ను చైనా శాస్త్రవేత్తలే కృత్రిమంగా సృష్టించారని బ్రిటీష్ ప్రొఫెసర్ అంగూస్ డాల్ గ్లిష్, నార్వే సైంటిస్ట్ బర్గర్ సొరెన్ సెన్ తమ నివేదికలో పేర్కొన్నారని వెల్లడించింది. 
 
దీన్ని ల్యాబ్‌లోనే పుట్టించారని చెప్పడానికి అవసరమైన ప్రత్యేక సంకేతాలను కూడా తాము గుర్తించామని వారు చెప్పినట్టు తెలిపింది. మరికొన్ని రోజుల్లో ఈ పూర్తి నివేదిక సైంటిఫిక్ జర్నల్‌లో ప్రచురితం కానుంది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 36 లక్షల మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధిక ప్రాణనష్టం జరిగిన దేశాల్లో అమెరికా, భారత్‌లో అధికంగా ఉన్నాయన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Betting: అల్లాణి శ్రీధర్ దర్శకత్వంలో బెట్టింగ్ చిత్రం

Deverakonda: కంటెంట్ మూవీస్ చేస్తూ తెలుగు అభివృద్ధికి కృషి చేస్తా - విజయ్ దేవరకొండ

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments