Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్ నవ్వు ఆపుకోలేకపోతున్నారు.. బాబు బ్రహ్మానందంగా మారిపోయారు..

Webdunia
శుక్రవారం, 21 జూన్ 2019 (10:26 IST)
''లక్ష్మీస్ ఎన్టీఆర్'' సినిమాను ఏ వేళ తీశాడోగానీ ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు ఏమాత్రం ఆ విషయం కలిసిరాలేదు. లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో ఏపీ మాజీ సీఎంను విలన్‌గా చూపెట్టడం ద్వారా ఎన్నికల ముందు టీడీపీ ఆ సినిమా ప్రభావం మైనస్‌నే మిగిల్చింది. ఆ సినిమాను విడుదల చేయకుండా అడ్డుకున్నా.. ఎన్నికల నేపథ్యంలో ఆ సినిమా ప్రభావం చంద్రబాబు పడిందనే టాక్ వచ్చింది. 
 
ఈ సినిమాలోని చాలా అంశాలు వాస్తవానికి దగ్గరగా వున్నాయని ఇటీవలే లక్ష్మీస్ ఎన్టీఆర్ కుమారుడు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో అధికారాన్ని కూడా కోల్పోయిన చంద్రబాబు కళ తప్పిందని.. సొంత పార్టీలే ఇక పార్టీలకు మారుతారని వస్తోంది. ఇప్పటికే టీడీపీ కీలక నేతలు బీజేపీ గూటికి చేరుకున్నారు. 
 
ఇలాంటి తరుణంలో మండుతున్న మంటల్లో ఆజ్యం పోసినట్లు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ టీడీపీ అధినేత చంద్రబాబుపై తాజాగా మరోసారి విరుచుకుపడ్డారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విదేశాల్లో ఉండగా, ఆయన్ను నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు పొడిచారనీ, ఇప్పుడు చంద్రబాబు విదేశాల్లో ఉండగా టీడీపీ నేతలు ఆయనకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. చరిత్ర ఎప్పటికీ పునరావృతం అవుతూనే ఉంటుందని వ్యాఖ్యానించారు.
 
ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడినప్పుడల్లా సీఎం జగన్ నవ్వును ఆపుకోలేకపోతున్నారని రామ్ గోపాల్ వర్మ గుర్తుచేశారు. దీని అర్థం చంద్రబాబు అసెంబ్లీలో బ్రహ్మానందంగా మారిపోయారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్‌లో స్పందించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments