లాక్డౌన్ పొడగింపుపై నిర్ణయం తీసుకోలేదు.. పుకార్లు నమ్మొద్దు: కేంద్రం

Webdunia
బుధవారం, 27 మే 2020 (18:20 IST)
కరోనా వైరస్ మహమ్మారికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా ప్రస్తుతం దేశంలో లాక్డౌన్ అమల్లోవుంది. ఈ నాలుగో దశ లాక్డౌన్ ఈ నెల 31వ తేదీతో ముగియనుంది. దీంతో ఈ లాక్డౌన్‌ను మరోమారు పొడగించనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా, మరో రెండు వారాలపాటు అంటే జూన్ 14వ తేదీ వరకు ఈ లాక్డౌన్ పొడగించవచ్చనే రూమర్లు వినిపిస్తున్నాయి. 
 
వీటిపై కేంద్ర హోం శాఖ బుధవారం ఓ క్లారిటీ ఇచ్చింది. లాక్డౌన్ పొడగింపుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. పైగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని దేశ ప్రజలకు కేంద్రం విజ్ఞప్తి చేసింది. 
 
కాగా, దేశంలో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న ఢిల్లీ, ముంబై, థానే, పూణె, చెన్నై, బెంగుళూరు, అహ్మదాబాద్, కోల్‌కతా, జైపూర్, సూరత్, ఇండోర్ వంటి ప్రాంతాలపై కేంద్ర ప్రత్యేక దృష్టినిసారించింది. ప్రస్తుతం దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో 70 శాతం కేసులు నగరాల్లోనే నమోదైవున్నాయి. అందుకే ఈ నగరాల్లో కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యలపై సీరియస్‌గా ఆలోచన చేస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manaswini: మనస్విని బాలబొమ్మల కొక్కోరోకో తో సినీ రంగ ప్రవేశం

Sara Arjun: విజయ్ దేవరకొండ నా ఫేవరేట్ హీరో - సారా అర్జున్

సారా అర్జున్ కాదంటే యుఫోరియా మూవీ తీసేవాడిని కాదు : దర్శకుడు గుణశేఖర్

మిల్కీ బ్యూటీని అవమానించిన ఆ కోలీవుడ్ స్టార్ హీరో ఎవరు?

Manchu Vishnu: షార్ట్ ఫిల్మ్ నుండి ఫీచర్ ఫిల్మ్ చేసే అవకాశం కల్పిస్తున్న మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పురుషుల కంటే మహిళలు చలికి వణికిపోతారు, ఎందుకని?

గుండెకి ఈ పండ్లు ఆరోగ్యం

అల్పాహారం, ఒత్తిడి, రాత్రిపూట నిద్ర... మధుమేహంతో లింక్

హైదరాబాద్‌లో తమ 25 ఏళ్ల కార్యకలాపాలను వేడుక జరుపుకున్న టిబిజెడ్-ది ఒరిజినల్

ఈ నూతన సంవత్సరంలో సాధారణ అలవాట్ల కోసం పెద్ద తీర్మానాలను చేసుకున్న అనన్య పాండే

తర్వాతి కథనం
Show comments