సీడీఎస్ బిపిన్ రావత్ చివరి క్షణాల్లో ఏం కావాలని అడిగారు...

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (11:50 IST)
గత బుధవారం తమిళనాడు రాష్ట్రంలో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో భారత త్రివిధ దళపతి బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్‌లు కన్నుమూశారు. అయితే, ఆయన చావుబుతుకుల మధ్య కొట్టాడుతూ చివరిగా మాట్లాడిన మాటలను ఓ ప్రత్యక్ష సాక్షి ఒకరు వెల్లడించారు. దాహంగా ఉంది కొన్ని మంచినీళ్లు కావాలని అడిగారని ప్రత్యేక్ష సాక్షి శివకుమార్ చెబుతున్నారు. 
 
ఈ హెలికాఫ్టర్ ప్రమాదంలో రావత్ దంపతులతో పాటు మొత్తం 13 మంది మృత్యువాతపడ్డారు. అయితే, హెలికాఫ్టర్ పెద్ద శబ్దంతో కూలిపోయిన వెంటనే స్థానికులు ప్రమాద స్థలికి చేరుకున్నారు. అలాంటివారిలో శివకుమార్ ఒకరు. ఈ ప్రమాదంపై ఆయన మాట్లాడుతూ, ఆ రోజున మధ్యాహ్నం మేం పని చేస్తున్న సమయంలో భారీ శబ్దం వినిపించిది. అపుడు అక్కడకు వెళ్లి చూడగా, చెట్టు కొమ్మలపై ఓ హెలికాఫ్టర్ మంటల్లో కాలుతూ కనిపించింది. ఆ ప్రదేశంలోని పొదల్లో మాకు ఇద్దరు వ్యక్తులు తీవ్రగాయాలతో కనిపించారు. బహుశా వారిద్దరూ హెలికాప్టర్ నుంచి దూకేసి ఉంటారు. 
 
వాళ్ల వద్దకు వెళ్లి చూస్తే వాళ్ల బట్టలు పూర్తిగా కాలిపోయి ఉన్నారు. వారిలో ఒకరు దాహంగా ఉంది కొన్ని మంచినీళ్లు కావాలని అడిగారు. మేం ఆయనకు ఏం కాదని ధైర్యం చెప్పి, తప్పకుండా సాయం చేస్తామని చెప్పాం. ఆ తర్వాత ఒక దుప్పటి సాయంతో వాళ్లను ముళ్ళ పొదల్లో నుంచి బయటుకు తీసుకొచ్చాం. అపుడే రెస్క్యూ సిబ్బంది వచ్చి ఆయన్ని ఆస్పత్రికి తీసుకెళ్ళారు. ఆయన్ను మేం ఎవరో సాధారణ వ్యక్తి అనుకున్నాం. కానీ, నేను మాట్లాడిన వ్యక్తి సీడీఎస్ బిపిన్ రావత్ అని కొంతమంది మంది చెప్పారు. ఆయన ఎంతో గొప్ప వ్యక్తి అని అపుడే తెలుసుకున్నాను అని ఘటన జరిగిన తీరును శివకుమార్ వివరించారు. 
 
ఈ దేశం కోసం అహర్నిశలు కష్టపడిన గొప్పవ్యక్తి.. ఆఖరి క్షణాల్లో మంచినీళ్లు అడిగనా ఇవ్వలేక పోయామని శివకుమార్ కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఢిల్లీలో నిర్వించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సుడిగాలి సుధీర్ గోట్ దర్శకుడుపై నటి దివ్యభారతి ఆరోపణ

Priyadarshi: నాకేం స్టైల్ లేదు, కొత్తగా చేస్తేనే అది మన స్టైల్ : ప్రియదర్శి

అఖిల్ మరో దేవరకొండ.. తేజస్వినీలో సాయి పల్లవి కనిపించింది : వేణు ఊడుగుల

Allari Naresh: హీరోయిన్ పై దోమలు పగబట్టాయి : అల్లరి నరేశ్

నిర్మాతగా స్థాయిని పెంచే చిత్రం మఫ్టీ పోలీస్ : ఎ. ఎన్. బాలాజి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments