విశాఖ ఉక్కు ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు ఉక్కు పరిరక్షణా సభలో పాల్గొనేందుకు వెళ్లనున్న నేపధ్యంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. పవన్ రాక కేంద్రంపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పవన్ చేస్తున్న ప్రయత్నాన్ని సమర్థిస్తున్నట్లు తెలిపారు.
కాగా తొలుత జనసేనలో చేరిన లక్ష్మీనారాయణ ఆ తర్వాత పార్టీ నుంచి వైదొలిగారు. పవన్ కళ్యాణ్ కు అంకితభావంపై తనకు అనుమానం వస్తోందని చెపుతూ పార్టీని వీడారు. ఐతే పవన్ మాత్రం అటు సినిమాలు చేస్తూనే ఇటు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ఈ అంశాలను లక్ష్మీనారాయణ నిశితంగా గమనిస్తున్నారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ విశాఖ సభలో పాల్గొనేందుకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. కానీ తాము వెనక్కి తగ్గేది లేదంటూ జనసైనికులు చెపుతున్నారు.