శ్రీరెడ్డి వాదనతో ఏకీభవించిన సమంత... వాళ్లను తరిమేయాల్సిందేనంటూ...

క్యాస్టింగ్ కౌచ్ పైన తెలుగు సినిమా ఇండస్ట్రీ భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. క్యాస్టింగ్ కౌచ్ అనేది లేనేలేదని కొందరు నటీమణులు అంటుంటే మరికొందరు ఇది వున్నదంటూ అంగీకరిస్తున్నారు. ఈ వ్యవహారంలో సినీ ఇండస్ట్రీలోని తారాలోకం ఎవరి అనుభవాలను వారు చెప్పుకుంటున్న

Webdunia
సోమవారం, 7 మే 2018 (16:02 IST)
క్యాస్టింగ్ కౌచ్ పైన తెలుగు సినిమా ఇండస్ట్రీ భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. క్యాస్టింగ్ కౌచ్ అనేది లేనేలేదని కొందరు నటీమణులు అంటుంటే మరికొందరు ఇది వున్నదంటూ అంగీకరిస్తున్నారు. ఈ వ్యవహారంలో సినీ ఇండస్ట్రీలోని తారాలోకం ఎవరి అనుభవాలను వారు చెప్పుకుంటున్నారు. క్యాస్టింగ్ కౌచ్ లేదని ఇటవలే నటి, ఎమ్మెల్యే రోజా, మరో టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యానించారు. 
 
ఐతే తాజాగా సమంత మాత్రం శ్రీరెడ్డి చేస్తున్న వాదనతో ఏకీభవించారు. సినీరంగంలో వంచకులు ఉన్నమాట వాస్తవేమనని చెప్పారు. ఐతే ఇది ఒక్క సినీ రంగంలోనే కాదనీ, అన్ని రంగాల్లోనూ వున్నారంటూ చెప్పుకొచ్చారు. తను ఎనిమిది సంవత్సరాలు ఈ రంగంలో ఉన్నాననీ, ఇక్కడ మంచి వాళ్లతో పాటు కొందరు నయవంచకులు కూడా ఉన్నారని షాకింగ్ కామెంట్లు చేశారు. దీనితో టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వున్నదంటూ చెపుతున్న తారల్లో సమంత కూడా చేరిపోయారు. 
 
ఐతే ఇలాంటి నయవంచకులను తరిమేస్తే చిత్ర పరిశ్రమ చాలా బాగుంటుందని వ్యాఖ్యానించారు. మరి ఆ నయవంచకులు ఎవరో టాలీవుడ్ సినీ పెద్దలు కనుగొని పారదోలుతారేమో చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలి? కమల్ హాసన్

తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ విషయంలో అంత కఠినంగా ఎందుకో?

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే కొత్త పోస్టర్

Sureshbabu: నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారుల సమస్యలకు సబ్ కమిటీ ఏర్పాటు

Peddi : పెద్ది నుంచి శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ ఫెరోషియస్ లుక్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments