వరుడికి షాకిచ్చిన వధువు.. తాళికట్టే సమయంలో ప్రియుడు వస్తున్నాడని..?

Webdunia
ఆదివారం, 1 నవంబరు 2020 (13:00 IST)
Bride-Bridegroom
తాళికట్టే శుభవేళ ఓ వధువు వరుడికి షాకిచ్చింది. తమిళనాడు నీల్‌గిరీస్‌లోని మట్టకండి గ్రామంలో జరిగిన ఈ ఘటన పెళ్లిమండపంలోని అందరినీ అశ్చర్యానికి గురిచేసింది. నా ప్రియుడు నా కోసం వస్తున్నాడని, ఈ పెళ్లి నాకొద్దంటూ వరుడు తాళికట్టే సమయంలో పేర్కొన్న వధువు అందరినీ విస్మయానికి గురిచేసింది. కరోనా నిబంధనల దృష్ట్యా కొద్దిమంది బంధువుల సమక్షంలో ఇరువురి కుటుంబసభ్యులు అక్టోబర్‌ 29న ముహూర్తం పెట్టుకున్నారు. 
 
అయితే చివరి నిమిషంలో వధువు తనకు ఈ పెళ్లి వద్దంటూ కుటుంబ సభ్యులను, వరుడిని ఒప్పించే ప్రయత్నం చేసింది. తన ప్రియుడు వస్తున్నాడని చెప్పి పెళ్లి మండపం నుంచి లేచి వెళ్లిపోయింది. కూతురి ప్రేమను అర్థం చేసుకున్న తల్లిదండ్రులు వధువును ప్రియుడికి అప్పగించారు. అదే మండపంలో వధువును ప్రియుడికిచ్చి వివాహం జరిపించారు.
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడు నీలగిరి జిల్లా కోతగిరిలో నివాసముంటున్న ప్రియదర్శినికి నీలగిరి జిల్లాకే చెందిన ఓ వ్యక్తితో వివాహాన్ని నిశ్చయించారు ఇరువురి కుటుంబసభ్యులు. వివాహ వేడుకలో వరుడు తాళి కట్టే సమయంలో తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, తాను ప్రేమించిన వాడు అరగంటలో వస్తాడని చెప్పడంతో వరుడు ఖంగుతిన్నాడు. ఆమె ఏం చెబుతుందో అర్థం కాక చుట్టూ వున్న బంధువుల వైపు చూశాడు.
 
బంధువుల జోక్యం చేసుకుని సర్ది చెప్పబోతే వధువు ససేమిరా అంది. ఓ పెద్దావిడ మరికొంత జోక్యం చేసుకుని వధువుని నాలుగు దెబ్బలేసైనా ఒప్పిద్దామనుకుంటే.. వధువు ఆ పెద్దావిడకు ఎదురు తిరిగింది.
 
ఈ తంతు కొనసాగుతుండగానే ఎటూ తోచని వరుడు వివాహ వేడుక నుంచి వెళ్ళిపోయాడు. కుటుంసభ్యులు ఎంతగా వారించిన ప్రియదర్శిని మాట వినకపోవడంతో పెళ్లి వద్దంటూ వివాహ వేడుకనుండి వెళ్లిపోయాడు వరుడు. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

Madalsa Sharma: మదాలస శర్మ కాస్టింగ్ కౌచ్ కామెంట్లు.. కెరీర్‌ ప్రారంభంలోనే?

Nandamuri Tejaswini : సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి తేజస్విని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments