పెళ్ళిపీటలపై కాబోయే భర్తను ఎడమకాలితో తన్నిన వధువు.. ఎందుకు?

Webdunia
శనివారం, 19 జనవరి 2019 (18:27 IST)
పెళ్ళి కొడుకు ఎలా ఉన్నా అడ్జెస్ట్ చేసుకుని పెళ్ళి చేసుకోవాలి... ఇది పెద్దవారు పెళ్ళి చేసుకోబోయే అమ్మాయిలకు చెప్పే మాటలు. కానీ కలియుగంలో మాత్రం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. పెళ్ళికొడుకు ఎలాంటి వాడు... అతని అలవాట్లు ఎలాంటివో తెలిస్తే తప్ప పెళ్ళి చేసుకోవడంలేదు యువతులు. కానీ ఒక యువతి ఏకంగా పెళ్ళి చేసుకోబోయే భర్తనే కాలితో తన్నింది. 
 
వివరాలు ఇలా వున్నాయి. పాట్నాకి సమీపంలోని తిలక్‌పూర్ గ్రామానికి చెందిన ఉదయ్ రజన్ అనే వ్యక్తికి అక్బర్‌పూర్‌కు చెందిన యోగేంద్ర రజక్ కుమార్తెకు వివాహానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ముహూర్తానికి పది నిమిషాలు ఉండగా ఉదయ్ రజన్ మద్యం సేవించినట్లు గుర్తించింది. దీంతో తాళిబొట్టు కడుతున్న సమయంలో అతడి నోటి నుంచి గుప్పుమంటూ మద్యం వాసన వచ్చింది.
 
అంతే.. ఒక్క ఉదుటున పైకి లేచి ఎడమకాలితో అతన్ని తన్నేసింది. మద్యం మత్తులో వున్న వరుడు ఆమె తన్నుకు దూరంగా పడిపోయాడు. అయితే రెండు కుటుంబాల వాళ్ళు యువతిని ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ ఆమె ఒప్పుకోలేదు. పెళ్ళే అవసరం లేదంటూ ఇంటికి వెళ్ళిపోయింది. వేరే దారి లేక పెళ్ళిని రద్దు చేశారు పెద్దలు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముచ్చటగా మూడోసారి విడాకులు ఇచ్చేశాను.. హ్యాపీగా వున్నాను: మీరా వాసుదేవన్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments