Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో అమ్మాయి.. స్కైప్ ద్వారా విడాకులిచ్చిన బాంబే హైకోర్టు

సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ ప్రభావంతో మానవీయ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. ట్రిపుల్ తలాక్‌ నుంచి మహిళలకు విముక్తి లభించిన వేళ... పరస్పర అంగీకారంతో విడిపోతున్న ఓ ఎన్నారై జంటకు స్కైప్ ద్వారా విడాకులు ఇవ్

Webdunia
మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (09:15 IST)
సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ ప్రభావంతో మానవీయ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి. ట్రిపుల్ తలాక్‌ నుంచి మహిళలకు విముక్తి లభించిన వేళ... పరస్పర అంగీకారంతో విడిపోతున్న ఓ ఎన్నారై జంటకు స్కైప్ ద్వారా విడాకులు ఇవ్వాలంటూ బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే.. 2002లో జలగాంలో పెళ్లి చేసుకున్న ఓ జంట 2016 నుంచి విడిపోయారు.
 
ఈ నేపథ్యంలో తమకు విడాకులు ఇవ్వాల్సిందిగా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. కానీ మహిళ కోర్టుకు హాజరుకాకపోవడంతో విడాకుల కోసం వారు పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. ఉద్యోగ రీత్యా మహిళ అమెరికాలో ఉండడంతో ఆమె కోర్టుకు హాజరు కావడం వీలుకాలేదని ఆమె తరపు న్యాయవాది సమీర్ వైద్య చెప్పారు. ఇంకా పిటిషన్‌‍ను కోర్టు కొట్టివేయడంతో వారు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. 
 
సాంకేతికత అభివృద్ధి చెందిన నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడాకులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు అంగీకరించిన న్యాయస్థానం స్కైప్ ద్వారా విడాకులు ఇచ్చేందుకు అంగీకరించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments