Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణ జింకల కేసు : ఆ హీరో దోషి.. ఇద్దరు హీరోయిన్లు నిర్దోషులు

కృష్ణ జింకల కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ దోషిగా తేలారు. అదే సమయంలో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ వచ్చిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్, బాలీవుడ్ నటి సోనాలీ బింద్రేలు నిర్దోషులుగా తేలారు. ఈ మేరకు జోధ్

Webdunia
గురువారం, 5 ఏప్రియల్ 2018 (11:47 IST)
కృష్ణ జింకల కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ దోషిగా తేలారు. అదే సమయంలో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ వచ్చిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్, బాలీవుడ్ నటి సోనాలీ బింద్రేలు నిర్దోషులుగా తేలారు. ఈ మేరకు జోధ్‌పూర్ కోర్టు గురువారం తీర్పునిచ్చింది. 
 
గత 1998లో 'హమ్ సాథ్ సాథ్ హై' చిత్రం షూటింగ్ నిమిత్తం జోధ్‌పూర్ పరిసర ప్రాంతాలకు వెళ్లిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కృష్ణ జింకలను వేటాడాడు. దీనిప కేసు నమోదు చేయగా, ఈ కేసు విచారణ కొన్నేళ్లుగా సాగుతూ వచ్చింది. ఈ కేసును విచారిస్తూ వచ్చిన కోర్టు గురువారం తీర్పును వెలువరించింది. ఇందులో సల్మాన్ ఖాన్ దోషేనని తేల్చింది. 
 
అదేసమయంలో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు సైఫ్ అలీ ఖాన్, సీనియర్ నటీమణులు సోనాలీ బింద్రే, టబు సహా ఐదుగురు నిర్దోషులని, వారు వేటాడలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు. జింకలను చంపడం ఏమాత్రం మానవత్వం కాదని జడ్జి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. జింకలను సల్మాన్ కాల్చినట్టు ప్రాసిక్యూషన్ నిరూపించిందని చెప్పారు. మరోవైపు, ఈ కేసులో అప్పీల్ చేసేందుకు సల్మాన్ తరపు న్యాయవాదులు సిద్ధమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments