Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ మేనల్లుడుని చంపేస్తాం...ఏం చేస్తారు? మమతా బెనర్జీకి వార్నింగ్

వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి బీజేపీ నేత సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన పేరు నిర్మల్ చంద్ర. మీ మేనల్లుడుని చంపేస్తే ఏం చేస్తారంటూ హెచ్చరించారు. పైగా, ఒక్క బీజేపీ కార్యకర్తను చంపితే మేము ఇద

Webdunia
ఆదివారం, 5 ఆగస్టు 2018 (13:25 IST)
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి బీజేపీ నేత సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన పేరు నిర్మల్ చంద్ర. మీ మేనల్లుడుని చంపేస్తే ఏం చేస్తారంటూ హెచ్చరించారు. పైగా, ఒక్క బీజేపీ కార్యకర్తను చంపితే మేము ఇద్దర్నీ చంపుతామంటూ బహిరంగంగా బెదిరించాడు.
 
కోల్‌కతా: బీజేపీ నేత నిర్మల్ చంద్ర మండల్ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడైన అభిషేక్ బెనర్జీని బెదిరిస్తూ కెమెరాకు చిక్కారు. కేరళ తరహా హింసాకాండను ప్రేరేపిస్తూ 'ఒక బీజేపీ కార్యకర్తను సీపీఎం చంపితే మేము ఇద్దర్ని చంపుతాం' అని సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
బిర్‌భూమ్‌లోని సూరిలో ఎస్‌పీ కార్యాలయం ఎదుట జరిపిన ప్రదర్శనలో చంద్ర మండల్ మాట్లాడుతూ... 'దీదీ...మీ మేనల్లుడు హత్యకు గురైతే మీరేం చేస్తారు?' అంటూ నిలదీశారు. కేరళలో తమ కార్యకర్తలు హత్యకు గురైనప్పుడల్లా ప్రతీకారం తీర్చుకుంటూనే ఉంటామని ప్రకటించారు. 
 
ఒక బీజేపీ కార్యకర్తను సీపీఎం కార్యకర్తలు చంపితే, తాము ఇద్దర్నీ చంపుతామని హెచ్చరించారు. కెమెరాలో తాను మాట్లాడిన ప్రతి మాట రికార్డు అవుతోందని తెలిసినప్పటికీ బీర్‌భూమ్ జిల్లా బీజేపీ విభాగం నేత అయిన చంద్ర మండల్ రెచ్చిపోయారు.
 
'మా నేత శ్యాంప్రసాద్ ముఖర్జీ (అశుతోష్ ముఖర్జీ తనయుడు) మాకు చెప్పిందొకటే. తప్పును ఖండించమన్నారు. అవసరమైతే ప్రతీకారం తీర్చుకోమన్నారు. మేమిప్పుడు ప్రతీకారం తీర్చుకుంటాం. ఆర్ఎస్ఎస్ వ్యక్తులతో కూడిన సంస్థ. 
 
సీపీఎం హంతకుల పార్టీ. వారు కేరళలో మాతో పోరాటం చేస్తున్నారు. వారు మాలో ఒక కార్యకర్తను చంపితే మేము ప్రతీకార చర్యగా ఇద్దర్ని చంపుతాం. ఇప్పుడు అలాంటి హింసే ఇక్కడ చోటుచేసుకోనుంది' అంటూ చంద్ర మండల్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments