Webdunia - Bharat's app for daily news and videos

Install App

కౌశల్ సైన్యం షాక్... కౌశల్ కంటే దీప్తికి ఎక్కువ ఓట్లు..

బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్‌కు ఓట్లు ఎంత అవసరమో అందరికీ తెలిసిన విషయమే. పలు విధానాలలో ఓట్లు వేసే అవకాశాన్ని కల్పించారు బిగ్ బాస్. అయితే మొదటి సీజన్ చూసిన తర్వాత ఒక అవగాహనకు వచ్చిన కొంతమంది హౌస్‌లోకి ఎంటరయ్యే ముందే కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిస

Webdunia
గురువారం, 20 సెప్టెంబరు 2018 (12:34 IST)
బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్‌కు ఓట్లు ఎంత అవసరమో అందరికీ తెలిసిన విషయమే. పలు విధానాలలో ఓట్లు వేసే అవకాశాన్ని కల్పించారు బిగ్ బాస్. అయితే మొదటి సీజన్ చూసిన తర్వాత ఒక అవగాహనకు వచ్చిన కొంతమంది హౌస్‌లోకి ఎంటరయ్యే ముందే కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సోషల్ మీడియాలో గ్రూపులు ఏర్పాటు చేసుకుని, వస్తున్నారు. ఇది కామనే, కానీ మరికాస్త ముందుకెళ్లి ఓట్ల కోసం టెక్నికల్ టీములను కూడా ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
 
ఈ నేపథ్యంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు కౌశల్. కౌశల్ ఆర్మీ పేరిట అతనికి ప్రచారం కల్పించడం, ఓట్లు అడగడం, మిగిలిన హౌస్‌మేట్స్‌ను సోషల్ మీడియాలో టార్గెట్ చేసి బ్యాడ్ చేయడం చేస్తున్నారు. ఇటీవలి నామినేషన్స్‌లో కౌశల్ కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన దీప్తిని టార్గెట్ చేసారు. ఆవిడకు ఓట్లు పొందడం కోసం ‘రామ్ ఐటీ సొల్యూషన్స్’ అనే సంస్థ ద్వారా ప్రత్యేక టెక్నికల్ టీమ్ ఏర్పాటు చేసుకుందని, ఆ కారణంగానే ఆమె 100 రోజులు కొనసాగగలిగిందని ఆరోపిస్తున్నారు.
 
ఇందులో నిజాలెంతవరకు ఉన్నాయో తెలీదు మరి. కౌశల్ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయనే అక్కసుతో కౌశల్ ఆర్మీ చేస్తున్న అసత్య ప్రచారం కూడా కావచ్చని దీప్తి సపోర్టర్స్ అంటున్నారు. కానీ, తమ వద్ద అందుకు తగిన ఆధారాలు ఉన్నాయంటూ పలు ఫోటోలు కూడా ట్విట్టర్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments