Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూమి వైపు దూసుకొస్తున్న స్టేడియం సైజులో ఉన్న గ్రహశకలం

Webdunia
బుధవారం, 21 జులై 2021 (15:52 IST)
భూమికి మరో ముప్పు పొంచివుంది. ఓ గ్రహ శకలం ఇపుడు మెరుపు వేగంతో దూసుకొస్తోంది. ఈ ఆస్టరాయిడ్ ఈ నెల 24న భూమిని దాటి వెళ్లిపోనున్న‌ట్లు అమెరిక‌న్ స్పేస్ ఏజెన్సీ నాసా వెల్ల‌డించింది. దీనికి 2008 గో20గా నామకరణం చేశారు. 
 
ఈ గ్రహశకలం ఓ స్టేడియం ప‌రిమాణం లేదా తాజ్‌మ‌హ‌ల్ కంటే మూడు రెట్లు పెద్ద‌గా ఉంద‌ని శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. గంట‌ల‌కు 18 వేల మైళ్ల వేగంతో అంటే సెక‌ను 8 కిలోమీట‌ర్ల వేగంతో ఇది భూమి వైపు దూసుకొస్తున్న‌ట్లు నాసా చెప్పింది. 
 
ఈ స్పీడు కార‌ణంగా ఆస్ట‌రాయిడ్‌కు అడ్డుగా వ‌చ్చే ఏదైనా ధ్వంస‌మైపోతుంద‌ని స్పేస్ ఏజెన్సీ తెలిపింది. ఈ ఆస్ట‌రాయిడ్ వ్యాసం 220 మీట‌ర్లుగా ఉంది. ఇది భూమికి 28 ల‌క్ష‌ల‌ కిలోమీట‌ర్ల దూరం నుంచి వెళ్ల‌నుంది. 
 
అంటే ఇది భూమి, చంద్రుడికి మ‌ధ్య ఉన్న దూరం కంటే ఎనిమిది రెట్లు. అయితే ఈ ఆస్ట‌రాయిడ్ సుర‌క్షితంగా భూమిని దాటి వెళ్లిపోతుంద‌ని నాసా తెలిపింది. అయితే ఈ ఆస్ట‌రాయిడ్ క‌క్ష్య‌ను అపోలోగా వ‌ర్గీక‌రించారు. ఈ కేట‌గిరీ ఆస్టరాయిడ్లు చాలా ప్ర‌మాద‌క‌రం. దీంతో ఈ ఆస్ట‌రాయిడ్ క‌ద‌లిక‌ల‌ను నాసా చాలా జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments